విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను సమక్షంలో విజయవాడ తూర్పు,పశ్చిమ నియోజకవర్గాల్లో జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లు నాయకులు మర్యాద పూర్వకంగా ఎంపి కేశినేని శివనాథ్ ను గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం కలిశారు. వైసిపి వీడి జనసేనలో చేరిన 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, 53వ డివిజన్ మహాదేవ్ అప్పాజీ, నాయకులు అత్తులూరి పెదబాబు, బహదూర్ లను సామినేని ఉదయభాను ఎంపి కేశినేని శివనాథ్ కు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్.ఎస్.బేగ్, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సొలంకి రాజు , టిడిపి సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News