దేవినేని అవినాష్ స్వగృహంలో వైభవంగా మహా పడిపూజ మహోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ స్వగృహంలో శీలం మనోజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమంలో దేవినేని అవినాష్ తో పాటు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కడియాల బుచ్చిబాబు, ఆడిటర్ నాయుడు, తదితర ప్రముఖులు పాల్గొని అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ మహా పడిపూజ మహోత్సవానికి వేలాదిగా అయ్యప్ప స్వాములు, భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగింది.