బాలల నాయకత్వ లక్షణాలకు మండల సమాఖ్య చక్కని వేదిక

-బాలల హక్కుల పరిరక్షణకు సమష్టిగా కృషి చేయాలి: సిస్టర్ విద్యా

తుళ్లూరు, నేటి పత్రిక ప్రజావార్త:
నేటి బాలలు భావి భారత నాయకులుగా ఎదగడానికి బాలల మండల సమాఖ్య చక్కని వేదికగా నిలుస్తుందని గుడ్ షెఫర్డ్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిస్టర్ విద్యా అన్నారు.
మందడం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నవంబర్ 8న గుడ్ షెఫర్డ్ సంస్థ ఆధ్వర్యంలో మండల స్థాయి బాలల పార్లమెంట్ సమాఖ్య ఏర్పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిస్టర్ విద్యా మాట్లాడుతూ బాలల హక్కులు, సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.
సంస్థ సిబ్బంది పెద్దిపాగ అనిల్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల నుంచి ఎంపికైన బాలబాలికలకు 50:50 నిష్పత్తిలో సమాన ప్రాతినిధ్యం కల్పిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి, విద్య, ఆరోగ్య, పర్యావరణ, హక్కుల పరిరక్షణ మంత్రులుగా పిల్లలకే బాధ్యతలు అప్పగించి ప్రతి నెలా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. బడికి దూరమైన పిల్లలను గుర్తించడం, బాల్యవివాహాల నివారణ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై చర్చించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
అంగన్‌వాడీ సూపర్‌వైజర్ శ్రీలత మాట్లాడుతూ పెద్దలు పిల్లలకు మార్గదర్శకులుగా ఉండాలే తప్ప, వారి నిర్ణయాలను ప్రభావితం చేయకూడదని తెలిపారు. బాలలే స్వయంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు.
కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ సిబ్బంది ఎన్. నాగమణి, బి. విజయలక్ష్మి, పి. అనిల్ కుమార్, మండలంలోని వివిధ గ్రామాల బాలబాలికలు పాల్గొన్నారు.