విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి రెండు
ఎల్ ఓ సీ లను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి బాధితులకు
ఎల్ ఓ సీ పత్రాలు అందజేశారు. 45 వ డివిజన్, కొత్తపేటకు చెందిన బీ హర్షిత (16) అండాశయ సంబంధిత సమస్యతో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3.95 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. 56 వ డివిజన్ కు చెందిన పర్వీన్ (48) చెవిలో ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 2.45 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ లను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు దేవిన హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్డీయే కార్యాలయంలో 6.40 లక్షల ఎల్ ఓ సీ ల అందజేత
