విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఎల్ ఓ సీ ను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో 48 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ నాయకులు దాడి మురళి కృష్ణతో కలిసి అందజేశారు. మల్లికార్జున పేటకు చెందిన వేల్పూరి దుర్గా భవాని, తన రెండు నెలల శిశువు అత్యవసర వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 5.45 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
చిన్నారి మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత
