విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను 48 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో అందజేశారు. గొల్లపాలెం గట్టుకు చెందిన విల్లా యామిని (15) హృద్రోగంతో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 8.12 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు దాడి మురళి కృష్ణ, బొల్లేపల్లి కోటేశ్వరరావు, భాను శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత
