మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నాయకులతో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ ఓ సీ అందజేశారు. హెచ్ బీ కాలనీ కు చెందిన కొల్లి జయంత్ ఈశ్వర్ (20) రోడ్డు ప్రమాదానికి గురై మోకాలికి తీవ్ర గాయమవగా ఎల్ ఓ సీ కొరకు దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన రూ 4 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను ఎన్డీయే కార్యాలయంలో అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు యేదుపాటి రామయ్య, కామ దేవరాజ్, దాడి అప్పారావు, దుర్బేసుల హుస్సేన్, గాలేటి లక్ష్మణరావు, పచ్చవ మల్లికార్జునరావు, బ్రహ్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.