అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒగ్గు గవాస్కర్‌తో పాటు ఆయన సతీమణి, ప్రముఖ న్యాయవాది ఒగ్గు సుజాత, తనయుడు లలిత్ వైభవ్ కలిసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ భేటీలో పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుంటూ కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతో సాదరంగా, ఆత్మీయ వాతావరణంలో సాగిన ఈ కలయిక కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆనందాన్ని అందించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో జరిగిన ఈ ఆత్మీయ భేటీ ఒగ్గు గవాస్కర్ కుటుంబానికి మధురమైన జ్ఞాపకంగా నిలిచింది.
ఆత్మీయ పలకరింపులు… అపురూపమైన ఆతిథ్యం… అనుబంధాలకు ప్రతిరూపంగా నిలిచిన ఆత్మీయ కలయిక!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఒగ్గు గవాస్కర్ కుటుంబ సభ్యులు
