విఎంసి మేయర్, 86 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారానికి పకడ్బందీ ఏర్పాట్లు

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో ఎన్నుకోబడ్డ మేయర్ మరియు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం నవంబర్ 23, 2026న జరుగుతున్న నేర్పద్యంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ ను క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మేయర్, 86 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగా కార్యక్రమానికి అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాట్లను ముందస్తు ప్రణాళికతో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో అదనపు కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్రరావు, సెక్రటరీ ప్రభుదాస్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, పర్యవేక్షణ ఇంజినీర్లు చంద్రశేఖర్, దుష్యంత్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు గోపాలకృష్ణమూర్తి, సురేఖ, చంద్రశేఖర్, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.