-మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో 55,765 మంది రైతుల ఖాతాలలో రూ.10.71 కోట్లు వైయస్సార్ సున్నా వడ్డి పంట రుణాల రాయితీ 1592 మంది రైతు ఖాతా లకు రూ.1.20 కోట్లు పంట నష్ట పరిహారం జమ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు కొండంత అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వంకు జనం నీరాజనాలు పలుకుతున్నారని రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్ఆర్ సీపీ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు.
సోమవారం ఉదయం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రబీ 2020-21, ఖరీఫ్ 2021 సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్ 2022 పంట నష్ట పరిహార పెట్టుబడి రాయితీని బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి జమ చేసారు.
కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లాస్థాయి కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు జన్ను రాఘవరావు, పొట్లపాలెం సర్పంచ్ గాజుల నాగరాజు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు శ్రీకాకుళం నాగేశ్వరరావు, పట్టపు శ్రీనివాసరావు, రామచంద్రారావు, వర్ణం పెదబాబు, కేశన శ్రీనివాసరావు, గుమ్మడి ముఖర్జీ, కేశన సుబ్రహ్మణ్యం పలువురు రైతులు తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో రూ.10.71 కోట్ల సున్నావడ్డి, రూ.1.20 కోట్ల నష్ట పరిహార పెట్టుబడి రాయితీ నమూనా చెక్కులను, లబ్దిదారులకు అందజేసారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు మచిలీపట్నం శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకొని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతన్నలకు పూర్తి వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసిందన్నారు. ప్రకృతి విపత్తుల పట్ల నష్టపోయిన రైతన్నలకు సత్వర ఉపశమనం కల్పిస్తూ వారికి కూడా పరిహారం అందించామన్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను కూడా బాధ్యతగా రైతన్నల ఖాతాల్లో జమ చేయడం హర్షణీయమన్నారు. ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోపే నష్టపరిహారం చెల్లిస్తామన్న మాట మరోసారి నిలబెట్టుకొని రైతుల హృదయాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెరగని ముద్ర వేశారని ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశంసించారు. రబీ 2020-21 సం. క్రింద జిల్లాలోని 10,047 మంది రైతులకు రూ.1.94 కోట్లు వడ్డీ రాయితీని చెల్లించడం జరుగుతుందన్నారు. 2021 ఖరీఫ్ లోని 23,954 మంది రైతులకు రూ.4.09 కోట్లు, గత ప్రభుత్వంలో జమ కాని 21,764 మంది రైతుల ఖాతాలకు రూ.4.68 కోట్లు చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. పంట నష్ట పరిహారం క్రింద హెక్టారుకు రూ.15వేలు చొప్పున జిల్లాలోని 1592 మంది రైతులకు రూ.120.85 కోట్లు నష్ట పరిహార పెట్టుబడి రాయితీ రైతన్నల ఖాతాల్లో జమ కానున్నట్లు ఎమ్మెల్యే పేర్ని నాని వివరించారు.
గుడివాక శ్రీరామ్ ప్రసాద్, అవనిగడ్డ రైతు వాస్తవ సాగుదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ కాలం ముగిసేలోపు పరిహారం రైతుకు అందించడం ఎంతో గొప్ప విషయమ ని అవనిగడ్డ రైతు గుడివాక శ్రీరామ్ ప్రసాద్ అన్నారు. పారదర్శకత సోషల్ ఆడిట్ కింద రైతు భరోసా కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించడం తన జన్మలో చూడలేదని అన్నారు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే అర్హత ఉండి జాబితాలో తమ పేర్లు లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు సైతం కల్పించడం ద్వారా రైతులకు ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది అన్నారు.
సిద్ది రెడ్డి నాగేశ్వరరావు, రైతు జొన్నలవారి మోడీ గ్రామం, మచిలీపట్నం మండలం గత ప్రభుత్వ హయాంలో తాము అనేక ఇబ్బందులు పడ్డామని, ఆశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, రైతన్నల మధ్య దళారులు క్షేత్రస్థాయి ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేయడం తప్పేది కాదని, చాలా సందర్భాల్లో తమకు పరిహారం ఎగ్గొట్టి చేతులు దులుపుకునే వారిని, ప్రస్తుతం ఈ- క్రాప్ ద్వారా నమోదైన నిజమైన సాగుదారులకు నేరుగా ఎకౌంట్లో డబ్బు పడటం తన జీవితంలో ఎన్నడూ చూడలేదని సిద్ది రెడ్డి నాగేశ్వరావు అనే రైతు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.