విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న పురస్కార గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు , 49 వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అడ్డూరి శ్రీరామ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించిన కీలక పాత్రను, విద్యారంగ అభివృద్ధికి చేసిన విశేష కృషిని స్మరించుకున్నారు దేశంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ఆయన అందించిన సేవలు, జాతీయ సమైక్యత కోసం చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని అడ్డూరి శ్రీరామ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు దుర్బేసుల హుస్సేన్, పచ్చి పులుసు వెంకట శివప్రసాద్, దాడి అప్పారావు, లింగం శివప్రసాద్ సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళులర్పించారు.
