ప్రజాస్వామ్య పరిరక్షన ఉద్యమం బలోపేతం…

-కూటమి మతోన్మాద చర్యలు తిప్పికొట్టాలి.
-ప్రభుత్వం ఎస్ఈసీ, పోలీసులతోనే గెలుపు
-పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
-అల్లూరిలో టీడీపీ ఓటమిపై మతమార్పిడి వ్యాఖ్యలు దారుణం
-సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు ఈశ్వరయ్య, శ్రీనివాసరావు
-విజయవాడ లెనిన్ సెంటరులో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉభయ కమ్యూనిస్టుల నిరసనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసముందని, ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు ఉండాలని, ప్రతి అభ్యర్థికి ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు గుజ్జుల ఈశ్వరయ్య, వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. దీనికితోడు కూటమి ప్రభుత్వం పాల్పడుతున్న మతోన్మాద చర్యలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం…రాబోయే పంచాయతీ, నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికలైనా కనీసం నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించి, ప్రజల్లో ఉన్న అసలైన బలం ఏమిటో ప్రజల తీర్పు ద్వారా నిరూపించు కోవాలని హితవు పలికారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అక్రమాలు ఖండించాలని, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాలని బుధవారం విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద సీపీఐ, సీపీఎం నిరసన నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సీపీఎం పశ్చిమ కార్యదర్శి సత్తిబాబు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.
గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సీపీఐ, సీపీఎం అభ్యర్థులపై ప్రత్యక్షంగా దాడులు జరిగాయని వివరించారు. గిద్దలూరు సమీపంలో సీపీఎం నాయకుడు ఆవులయ్యపై దాడి చేసి ఆయన చేతిని విరగ్గొట్టారని, కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, పామÖరు, కనిగిరి తదితర ప్రాంతాల్లో సీపీఐ అభ్యర్థులపై దాడులకు దిగారని, నామినేషన్ పత్రాలను చించివేశారని, కొంతమంది అభ్యర్థులను పోలింగ్ కేంద్రాల వద్దకు కూడా రానీయకుండా అడ్డుకున్నారన్నారు. నామినేషన్ ఆమోదం పొందిన తర్వాత కూడా అక్రమాలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయని, చిత్తూరు జిల్లాలోని 50వ డివిజన్‌లో జిల్లా పార్టీ కార్యదర్శి నాగరాజు నామినేషన్ దాఖలు చేశారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ పరిస్థితులు కేవలం చిత్తూరు, పుంగనూరు, మదనపల్లి, కడప ప్రాంతాలకే పరిమితం కాలేదనీ, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని వివరించారు. ఇది ఒక్క ప్రాంతానికే సమస్య పరిమితం కాలేదనీ, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా పలాస వంటి ప్రాంతాల్లోను సీపీఐ అభ్యర్థులను బెదిరించి, ఎన్నికల బరిలో నుంచి తప్పించేందుకు ప్రయత్నించారన్నారు. ఈ పరిస్థితికి ఒకవైపు అధికార కూటమి ప్రభుత్వ వైఖరి కారణమైతే, మరోవైపు ఎన్నికల ప్రక్రియలో పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని, ఒక పోలీసు అధికారిగా ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. గతంలో ఎన్నికల సమయంలో అక్రమాలు జరిగితే, అప్పుడే వాటిపై చర్యలు తీసుకోవాలేగానీ, అప్పుడు పోలీసు అధికారులుగాను, ఇప్పుడు మీరే ఉన్నారనీ, అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. వాటికి మేము ఎప్పుడైనా అడ్డుపడ్డామా? అని సూటిగా ప్రశ్నించారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న అనిల్ చంద్ర పునేsఠా పాత్రపైనాఅనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఆయన గతంలో పదవీ విరమణ చేసినప్పటికీ, తిరిగి బాధ్యతల్లోకి చంద్రబాబు తీసుకొచ్చారన్నారు. ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలేగానీ, ఎన్నికల సమయంలో పోలీసు, రెవెన్యూ శాఖలు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ప్రస్తుతం ఆ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయకుండా, సీఎం చంద్రబాబు కనుసన్నల్లో నడవడం దారుణమని అన్నారు. ముఖ్యంగా కమÖ్యనిస్టు పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల్లో పాల్గొనడానికి అనేక అడ్డంకులు సృష్టించడం ఎన్నడూ లేదన్నారు. ఒక వైపు సీఎం చంద్రబాబు నుంచి మంత్రి లోకేశ్ వరకు రాజ్యాంగం గురించి చెబుతూనే, మరోవైపు అదే రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే ఎలా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అభ్యర్థులను బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం, నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేశారని, పోటీ నుంచి తప్పుకోకపోతే కుటుంబ సభ్యుల ఉద్యోగాలకు ముప్పు కలిగిస్తామని బెదిరింపులకు దిగారన్నారు. 2,175 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం, దాదాపు 100 జడ్పీటీసీ స్థానాలు, 17 మున్సిపాల్టీలు, ఏకగ్రీవం అయ్యాయని, 2 వేలకు పైగా ఇతర స్థానాల్లో పోటీ లేకుండా ఎన్నికలు జరిపి విజయోగత్సవంగా భావించడం తగదన్నారు. ప్రతి జడ్పీటీసీ పరిధిలో కనీసం 30 వేల మంది ఓటర్లు ఉన్నారని పరిగణనలోకి తీసుకుంటే, దాదాపు 25 నుంచి 30 లక్షల మంది ఓటర్లకు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన అల్లూరి జిల్లాలో మత మార్పిడివల్లే ఓటమి పాలయ్యామంటూ సీఎం చంద్రబాబు సమీక్షలో వెల్లడించడం తగదన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత రోజురోజుకూ పెరుగుతోందని, ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్య వ్యవస్థపై దుష్టశక్తులు నాలుగు వైపులా దాడి చేశాయన్నారు. ఒకవైపు అధికార పార్టీకి చెందిన అక్రమాలు..పల్నాడు జిల్లా నుంచి చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల వరకు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయని, మొత్తం 13 జిల్లాల్లో ఎలాంటి నియంత్రణ లేకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా దౌర్జన్యాలు జరిగాయని వివరించారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం వ్యవహరించాయని, ప్రతిపక్ష పార్టీలు కనీసం నామినేషన్లు దాఖలు చేసుకునే పరిస్థితి లేకుండా అడ్డంకులు సృష్టించడంతోపాటు అప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను సైతం ఉపసంహరణకు ఒత్తిడి చేస్తున్న ఘటనలు నెలకొన్నాయన్నారు. డీఎస్పీల నుంచి ఎసఐల వరకు అనేక మంది పోలీసు అధికారులు అభ్యర్థులను బెదిరిస్తూ, నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించడం దారుణమని, మరోవైపు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బెదిరింపులకు ఫిర్యాదులు వచ్చాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎలా జరుగుతాయి? అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం ఫలితాల ప్రకటనతో ముగిసే ప్రక్రియ కాదనీ, ప్రతి పౌరుడికి ఓటు వేసే అవకాశం కల్పించడం, ప్రతి అభ్యర్థికి పోటీ చేసే స్వేచ్ఛను రక్షించడం, భయరహిత వాతావరణాన్ని కల్పించడం ఎన్నికల వ్యవస్థ ప్రాథమిక బాధ్యతని సూచించారన్నారు. ఎన్నికల ఫలితాలపై కూటమి నేతలు100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాలంటున్నారని, అందుకోసం ఎంతటి దౌర్జన్యానికైనా సిద్ధపడాలనేలా ఎమ్మెల్యేలను సైతం రంగంలోకి దించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైందని, గిరిజన ప్రాంతాల్లో ఆ పార్టీకి ప్రజల మద్దతు లభించలేదని, దీనికి ప్రధాన కారణం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమేనని అన్నారు. గిరిజనుల హక్కులకు సంబంధించిన 1/70 చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరిగాయని, గిరిజనులకు ప్రత్యేక డీఏసీ ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారని, పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీల అమలులో పురోగతి లేదన్నారు. ఆదివాసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, వారి సమస్యలను పరిష్కరించకుండా, ఇప్పుడు వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే మతమార్పిడుల అంశాన్ని తెరపైకి తీసుకురావడాన్ని పూర్తిగా తప్పుపట్టారు.
సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో విధ్వంసాల పాలన కొనసాగుతోందన్నారు. తమది మంచి ప్రభుత్వం అని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం కాదనీ, ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, మంత్రులు, కూటమి పార్టీల నాయకులతో రాక్షసానందం పొందుతున్న పరిస్థితి ఉందన్నారు. మోదీ సహాయంతో ఈ ఎన్నికల్లో రిహార్సల్స్ చేసి, అదే దిశగా రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి, చంద్రబాబు శాశ్వతమైన పరిపాలన చేసుకునే దురాలోచనకు ఒడిగట్టారని మండిపడ్డారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దారుణాలకు పాల్పడిందంటూ..నాడు ప్రతిపక్షంలో ఉండి విమర్శించిన చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ అంతకు మించినటువంటి నిర్బంధాన్ని, నిరంకుశత్వాన్ని, అప్రజాస్వామిక విధానాల్ని, పద్ధతుల్ని పాటించడం కళ్ళారా చూస్తున్నామన్నారు. వీడియోలూ ప్రత్యక్షంగా కనపడుతున్నాయనీ, బయటకొచ్చినవి నూటికి ఐదు శాతమేనని అన్నారు. విజయవాడలో జరిగిన ఎన్నికల్లో ఉభయ కమÖ్యనిస్టు పార్టీలు 34 స్థానాల్లో పోటీ చేశాయని, మేయర్ అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావుకు ఉమ్మడిగా మద్దతిచ్చామని చెప్పారు. ఈ ఎన్నికల్లో ధనస్వామ్యం, డబ్బును మనం చూశామన్నారు.
సభకు అధ్యక్షత వహించిన జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందన్నారు. పోలీసు, అధికార యంత్రాంగం పూర్తిగా ప్రభుత్వానికి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఈ నిరసనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ బోయ సత్తిబాబు, ఏఐఎసఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.వలరాజు, బందెల నాసర్ జీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.యుగంధర్, డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుట్టి రాయప్ప, సీపీఐ నుంచి మÖలి సాంబశివరావు, తాడి పైడియ్య, ఓర్సు భారతి, పంచాదర్గ దుర్గాంబ, సిహెచ్.అనిత, జి.షైని, నాగమణి, కొట్టు రమణ, సందుల పేరయ్య, డి.వి.రమణబాబు, కొడాలి ఆనందరావు, తూము వీరయ్య, తూనం వీరయ్య, సింగరాజు సాంబశివరావు, ఆర్.పిచయ్య, సీపీఎం నుంచి టీ.రమణారావు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.