రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే. ప్రకాష బాబు లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లోని పోలీసు అధికార్లతో , రాజమహేంద్రవరం పరిధిలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశం లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత మాట్లాడుతూ డిసెంబర్ 14వ తేదీన …
Read More »All News
హుకుంపేట సావిత్రి నగర్ నుంచి బాలాజీ పేట వరకూ ఆక్రమణల తొలగింపు కై విస్తృత స్థాయిలో పరిశీలన
-క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి డ్రైయిన్స్ , రహదారుల ఆక్రమణలు తొలగించాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాలలో డ్రెయిన్స్, రహదారులు, అంతర్గత రహదారుల పై ఉన్న ఆక్రమణలని తొలగించే కార్యక్రమాన్నీ తక్షణం చేపట్టి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం హుకుంపేట, బాలాజి పేట ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఆవ డ్రెయిన్ పరిథిలోని 6.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ …
Read More »శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో వేడుకగా జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకలు
-లక్ష్యం ఉంటే తప్పక విజయం సాధ్యం -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత -అంగన్వాడీ కేంద్రాల ద్వారా మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉంది. -కలక్టర్ పి. ప్రశాంతి -ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రథాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కలలను సాకారం చేసుకోవాలని జిల్లా ప్రథాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపు నిచ్చారు. గురువారం ఉదయం స్ధానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రం లో నిర్వహించిన …
Read More »ఉత్తమ లక్ష్యం తో శ్రద్ద గా చదవాలి…
-కష్టపడి చదివితే అనుకున్న ఫలితాలను సాధిస్తాం -ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల లో బాలల దినోత్సవ వేడుకలు -జిల్లా జడ్జి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల విద్యాబ్యాస దశ నుంచే లక్ష్యాన్ని ఎన్నుకుని కష్టపడి చదివితే అనుకున్న ఫలితాలను సాధించి భవిష్యత్తు లో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తాని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గందం సునీత పేర్కొన్నారు. గురువారం బాలల దినోత్సవం సందర్బంగా స్థానిక కోటిపల్లి సెంటర్ లో గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో జిల్లా న్యాయ సేవధికార సంస్థ ఆధ్వర్యంలో …
Read More »నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.15.11.2024 శుక్రవారం నాడు విజయవాడ లోని “Joyalukkas Jewellery, ఎం.జీ రోడ్, వివంత హోటల్ పక్కన, లబ్బీపేట్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు (FAC) మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి …
Read More »యుపిపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షల కొరకు బిసి విద్యార్థులకు ఉచిత కోచింగ్
-బిసి విద్యార్థులకు ప్రత్యేకమైన ఏపి స్టేట్ స్టడీ సర్కిల్ ఏర్పాటు -అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ -డా. ఏ. మల్లిఖార్జున, సంచాలకులు, బిసి సంక్షేమ శాఖ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యుపిపిఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల కొరకు అర్హత గల బిసి విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బిసి సంక్షేమ శాఖ సంచాలకులు డా. ఏ. మల్లిఖార్జున ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం విద్యార్థులకు ప్రత్యేకమైన ఏపి స్టడీ సర్కిల్ బిసి భవన్ గొల్లపూడి …
Read More »సత్యవేడు మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైరల్ ఫీవర్ తో చికిత్స పొందుతున్న బిసి గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్
-విద్యార్థులకు మెరుగైన వైద్యo అందించాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ సత్యవేడు, నేటి పత్రిక ప్రజావార్త : సత్యవేడు నందు జ్యోతిరావు పూలే వెనుక బడిన తరగతుల బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు వైరల్ ఫీవర్ బారిన పడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు చికిత్స పొందుతున్న వీరిని పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారo సత్యవేడు జ్యోతిరావు పూలే వెనుక బడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు …
Read More »నారాయణవనం మండలం లోని పాలమంగళం బీసి కాలని లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డును పరిశీలించిన జిల్లా కలెక్టర్
-సింగిరికోన లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ నారాయణవనం, నేటి పత్రిక ప్రజావార్త : నారాయణవనం మండలంలోని పాలమంగళం బీసి కాలనిలో నూతనంగా ఉపాధి హామీ పథకం గ్రాంట్ ద్వారా పూర్తయిన సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించి, మిగిలిన రోడ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం సాయంత్రం మండలంలోని పాలమంగళం బీసీ కాలనీలోనే నూతనంగా నిర్మిస్తున్నటు వంటి సిసి రోడ్లను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం గ్రాంట్ ద్వారా కొన్ని …
Read More »అస్వస్థతకు గురైన సత్యవేడు గురుకుల పాఠశాల విద్యార్థులకు మెరుగైన వైద్యమందించండి
-తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు మంత్రి సవిత ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా సత్యవేడు బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత ఆరా తీశారు. వైరల్ ఫీవర్ల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురియ్యారని తెలుసుకున్న మంత్రి…మెరుగైన వైద్యమందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, డీఎంఅండ్ హెచ్వో శ్రీధర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులను ఆదేశించారు. సత్యవేడు బీసీ గురుకుల పాఠశాలకు …
Read More »అవగాహన ద్వారానే క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చు
-వరదయ్యపాలెం మత్తెరిమిట్ట గ్రామం క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ వరదయ్యపాలెం, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ నివారణ చర్యలో భాగంగా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఎం ఎల్ హెచ్పీలు క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే నిర్వహించి అనుమానత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి సరైన చికిత్స మరియు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక వరదయ్యపాలెం మత్తెరిమిట్ట గ్రామం నందు ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ …
Read More »