Breaking News

All News

రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. సోమవారం కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. శనివారం వరకు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర ప్రయాణాల్లో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలన్నారు. ఇవాళ కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరు …

Read More »

రేపు ఏఐ ఆధారిత ఆరోగ్య వ్య‌వ‌స్థ‌- భాగ‌స్వాముల స‌ద‌స్సు

-‘మెడ్‌టెక్ ఛాలెంజ్ గ్రాండ్’ విజేత‌ల ఎంపిక కూడా… అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఏఐ(Artificial Intelligence) ఆధారిత ఆరోగ్య వ్యవస్థ‌-వ్యూహాత్మక భాగస్వాముల సదస్సు, ‘ మెడ్ టెక్‌ ఛాలెంజ్ గ్రాండ్ ‘ఫైనల్ కార్యక్రమం మంగళవారం మంగ‌ళ‌గిరిలోని ‘జరగబోతుంది. ఆరోగ్య రంగంలో రకరకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు, ఏజెన్సీల ముఖ్య ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ఇతర రంగాలకు చెందిన వారు కలిపి సుమారు 300 మంది ఈ సదస్సు, మెడ్ టెక్‌ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ప్రభుత్వాసుపత్రు(పైలట్ …

Read More »

ఎంఎస్ఎంఈతో ఏపీలో పారిశ్రామిక విప్ల‌వం

– ఎంఎస్ఎంఈ గ్రోత్ స‌మ్మిట్ 2026లో మంత్రి కొండ‌ప‌ల్లి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఎంఎస్ఎంఈతో ఏపీలో స‌రికొత్త ఔత్సాహిక‌, స‌రికొత్త పారిశ్రామిక విప్ల‌వానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాంది ప‌లికార‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమ‌వారం విజ‌య‌వాడ‌లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ క‌ళావేదిక‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ముఖ్య అతిథిగా ఎంఎస్ఎంఈ గ్రోత్ స‌మ్మిట్ 2026 కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కొండ‌ప‌ల్లి …

Read More »

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలపై శాఖల వారీగా సమీక్ష సమావేశం

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలపై వర్చువల్ విధానంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావుతో కలిసి …

Read More »

నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలి : కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫిరెన్స్ హాలు నందు జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి) జరిగిన సమీక్షలో వర్చువల్ గా జిల్లా …

Read More »

ఎఫ్.ఆర్.ఎస్. సాంకేతికతతో మిస్సింగ్ బాలికను చాకచక్యంగా గుర్తించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని బాలికను ఈ రోజు ఎన్.టి.ఆర్. జిల్లా పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాలికను గుర్తించిన అనంతరం కేవలం 25 నిముషాల వ్యవదిలో క్షేమంగా అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించడం జరిగింది. ఈ నెల 24వ తేదీన గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని బాలిక వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపడం జరిగింది. ఆ వివరాలను ఆర్.టి.జి.ఎస్. సిస్టమ్ …

Read More »

ఎన్.టి.ఆర్.పోలీస్ ఖాకీ స్టూడియో ప్రారంభం

-నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. వినూత్న చొరవ -నేరం జరగకముందే ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యం. -సైబర్ నేరాల నియంత్రణకు అత్యాధునిక AI సాంకేతికత వినియోగం. -ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్‌కు 5 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతకంటే వేగంగా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ సాంకేతిక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సరికొత్త తరహా …

Read More »

నగరంలో ది మార్క్స్ స్టూడియో ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో అందాల తారలు శివాని నాగారం, పాయల్ రాజ్ పుత్ సందడి చేశారు. బి ఆర్ టి ఎస్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన ది మార్క్స్ స్టూడియో ను వారు లాంఛనంగా ప్రారంభించారు. ఆధునిక కాలంలో యువతి యువకులు హెయిర్ స్టైల్, మేకప్ పట్ల అమిత ఆసక్తి చూపిస్తున్నారనీ అన్ని రకాల సేవలను ఒకే స్టూడియోలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా హీరోయిన్స్ పాయల్ రాజ్ పుత్, శివాని నాగారం పేర్కొన్నారు. …

Read More »

రూ.6వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపట్టాం

-ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కూటమి కట్టుబడి ఉంది -విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సేవలు అందించాలనే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది -గత రెండు సంవత్సరాలుగా ఒక్కరూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు -విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశాం -వినియోగదారుల ఫిర్యాదులకు అధికారులు త్వరితగతిన స్పందించాలి ఆచంట, నేటి పత్రిక ప్రజావార్త : రూ. 6 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల నిర్మాణాలను చేపట్టామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. విద్యుత్ వ్యవస్థను మరింత …

Read More »

పండుగ వాతావరణాన్ని తలపించేలా ఈనెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు

-విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో భారీ ఏర్పాట్లు -నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని మహానాడును విజయవంతం చేయాలి – ప్రభుత్వ విప్, MLA బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ BRTS రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయంలో సోమవారం ఈనెల 27, 28 తేదీలలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, డివిజన్ నాయకులతో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విస్తృత స్థాయి సన్నాహక …

Read More »