Breaking News

All News

గోవధ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని మీకోసం సమావేశం మందిరంలో పశుసంవర్ధక శాఖ గోవధ నిషేధంపై రూపొందించిన గోడ పత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోవధ నిషేధము జంతు సంరక్షణ చట్టం 1977 ప్రకారం గోవులను వధించడం చట్టరీత్యా నేరం అన్నారు. గోవదకు పాల్పడిన అందుకు సహాయపడిన వారు …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ

-సకాలంలో పరిష్కారం చూపాలని అధికారులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వాటిని సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఈ మేరకు జాయింట్ కలెక్టర్ …

Read More »

రైతాంగ అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సక్రమంగా నడిపిస్తూ రోడ్ల అభివృద్ధి, సాగునీటి సదుపాయాల మెరుగుదల వంటి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సోమవారం ఉదయం మంత్రి మచిలీపట్నం మండలం అరిసెపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చిట్టిపాలెం గ్రామంలో కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రైతాంగానికి అవసరమైన సాగునీటి …

Read More »

ప్రజలకు మరింత చేరువలో ఆధార్ సేవలు అందుబాటులోకి : మంత్రి కొల్లు రవీంద్ర

-మచిలీపట్నంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి నూతన ఆధార్ సేవా కేంద్రం ప్రారంభించిన మంత్రి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరంలో ప్రజలకు మరింత చేరువలో ఆధార్ సేవలు అందుబాటులో వచ్చాయని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సోమవారం ఉదయం మంత్రి మచిలీపట్నం నగరంలోని కొజ్జిలిపేట కెనెడీ రోడ్డులో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడిఏఐ) ఆధ్వర్యంలో నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా సహకార …

Read More »

మచిలీపట్నంలో ఎంఎస్ఎంఈ పార్కుతో కొత్త పారిశ్రామిక శకానికి శ్రీకారం..

-యువతకు ఉపాధి, బందరు అభివృద్ధికి ఇది కీలక అడుగు : మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు ద్వారా కొత్త పారిశ్రామిక శకానికి నాంది పలుకుతున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. “నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు” కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం మచిలీపట్నం పోర్టుకు సమీపంలోని కరగ్రహారంలో మంత్రి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజితో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ …

Read More »

ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని ప్రజల వినతులను స్వీకరించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కమిషనర్, …

Read More »

అన్న క్యాంటీన్లలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తున్నాం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని అన్న క్యాంటీన్లలో ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. సోమవారం ఉదయం తన నగర పర్యటనలో భాగంగా బందర్ రోడ్, సూర్యారావుపేట, వన్‌టౌన్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణ, శుభ్రత పనులు, ప్రజలకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వన్‌టౌన్‌లోని గాంధీజీ మహిళా కళాశాల సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను …

Read More »

మా పోరాటానికి సంఘీభావం తెలపండి

-అఖిలపక్ష నేతలకు ఉండవల్లి,పెనమాక, నిడమర్రు గ్రామ రైతుల విజ్ఞప్తి -రాజధాని రైతుల ఉద్యమానికి అండగా నిలుస్తాం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని రెండో విడత భూసేకరణ/సమీకరణ నుంచి తమ గ్రామాలను మినహాయించాలని, ఇప్పటికే భూములిచ్చి ప్లాట్లు ఇవ్వకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బలవంతంపు భూసేకరణ/సమీకరణ ఆపాలంటూ ఇటీవల నుంచి ఆ ప్రాంత రైతులు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా …

Read More »

మోడీ ప్రభుత్వం పదేపదే పెట్రో ధరలు పెంచడం దుర్మార్గం

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మోడీ ప్రభుత్వం పదే పదే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై గుదిబండ మోపడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగుసార్లుగా రూ.8 లకుపైగా పెంచింది. ప్రజలపై ధరల భారం మోపడమే పనిగా పెట్టుకుంది. నేడు నాలుగో దఫా పెట్రోల్‌పై …

Read More »

అత్యున్నత ప్రజా కళా సంస్థ ప్రజానాట్యమండలి

-83వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న అత్యున్నత ప్రజా కళా సంస్థ ప్రజానాట్యమండలి అని రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ అన్నారు. అఖిలభారత ప్రజానాట్యమండలి (ఐపిటిఏ )83 వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడ దాసరి భవన వద్ద పతాకాన్ని వారు ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్ కే నజీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రనాయక్ మాట్లాడుతూ ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా దేశంలో స్వాతంత్ర కావాలంటూ కళాకారులందరూ ఐక్యమై కళారూపాల ద్వారా ప్రజలను జాగృతం …

Read More »