Breaking News

అత్యున్నత ప్రజా కళా సంస్థ ప్రజానాట్యమండలి

-83వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న అత్యున్నత ప్రజా కళా సంస్థ ప్రజానాట్యమండలి అని రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ అన్నారు. అఖిలభారత ప్రజానాట్యమండలి (ఐపిటిఏ )83 వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడ దాసరి భవన వద్ద పతాకాన్ని వారు ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్ కే నజీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రనాయక్ మాట్లాడుతూ ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా దేశంలో స్వాతంత్ర కావాలంటూ కళాకారులందరూ ఐక్యమై కళారూపాల ద్వారా ప్రజలను జాగృతం చేసిన సంస్థ అన్నారు. నిర్దిష్టమైన లక్ష్యంతో ప్రజల సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని ప్రజలను మేల్కొల్పడం జరిగిందన్నారు. స్వాతంత్ర పోరాటాలకు బాసటగా నిలిచి విభిన్నమైన కళారూపాలతో ప్రజలను మేల్కొల్పడం జరిగిందన్నారు. వేలాది పాటలు అనేక నాటికలు నాటకాలు తయారుచేసి ప్రజలను మేల్కొల్పడం జరిగిందన్నారు. సాధారణ మనుషులను గొప్ప కళాకారులుగా తయారు చేసిన చరిత్ర ప్రజానాట్య మండలి అన్నారు. రాష్ట్రానికి సమగ్ర సాంస్కృతిక విధానం కావాలంటూ కళాకారుల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. సీనియర్ ప్రజానాట్యమండలి నాయకులు ఆర్. పిచ్చయ్య మాట్లాడుతూ మతోన్మాదానికి వ్యతిరేకంగా మనుషులందరూ సమానమన్న భావన కల్పించడానికి కళారూపాలను సాధనంగా ఉపయోగించుకుందని అన్నారు. ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు లంక దుర్గారావు మాట్లాడుతూ ప్రజా చైతన్యమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న సంఘం ప్రజానాట్యమండలి అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు కే వి భాస్కరరావు మాట్లాడారు. ధోనిపూడి సూరిబాబు,శర్మ రంగారావు అజయ్ రాము గుణసుందరి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *