Breaking News

ఎన్.టి.ఆర్.పోలీస్ ఖాకీ స్టూడియో ప్రారంభం

-నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. వినూత్న చొరవ
-నేరం జరగకముందే ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యం.
-సైబర్ నేరాల నియంత్రణకు అత్యాధునిక AI సాంకేతికత వినియోగం.
-ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్‌కు 5 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతకంటే వేగంగా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ సాంకేతిక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సరికొత్త తరహా మోసాలు నిరంతరం పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, “నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. నేరం జరగకముందే ప్రజల్లో అవగాహన కల్పించడం మిన్న” అనే దూరదృష్టితో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

ఈ క్రమంలో ఈ రోజు పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ,పి.ఎస్.చేతుల మీదుగా లాంచనంగా ఎన్.టి.ఆర్.పోలీస్ ఖాకీ స్టూడియో అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సాంకేతిక చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజుకో కొత్త రకం మోసం పుట్టుకొస్తోంది. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, అసలు నేరమే జరగకుండా ముందే ప్రజలను అప్రమత్తం చేయడమే సురక్షితమైన మార్గం. సమాజంలో సైబర్ భద్రత, మహిళల భద్రత, పిల్లల సంరక్షణ మరియు రోడ్డు భద్రతపై ఒక బలమైన బాధ్యతాయుతమైన సంస్కృతిని (Safety Culture) నిర్మించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం ఒక శిక్షణ కార్యక్రమం కాదు, భవిష్యత్తులో సైబర్ నేరాలను తగ్గించేందుకు పోలీసింగ్‌లో సాంకేతికతను ప్రజల రక్షణకు మలిచిన ఒక విప్లవాత్మక అడుగు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు షిరిన్ బేగం ఐ.పి.ఎస్., కే.జి.సి.సరిత ఐ.పి.ఎస్., కె.కృష్ణ ప్రసన్న ఐ.పి.ఎస్., లక్ష్మీనారాయణ ఐ.పి.ఎస్., ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *