Breaking News

All News

తూర్పు గోదావరి జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బుడ్డెపు నగేష్ బాధ్యతలు స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బడ్డెపు నగేష్ బుధవారం రాజమహేంద్రవరం వైటిసి ఆవరణలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఏపిడి) వై సత్యం నాయుడు, పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బుడ్డెపు నగేష్ సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌గా సహకార శాఖలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ రిజిస్ట్రార్ / ఫ్యాకల్టీగా రాందాస్ కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్, రాజమండ్రిలో …

Read More »

నల్సా వారి పథకం కింద న్యాయ అవగాహన సదస్సు నిర్వహణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టంపై అవగాహన అవసరం – జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి బుధవారం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీలక్ష్మి బొమ్మూరు గ్రామ పంచాయతి కార్యాలయంలో “నల్సా వారి (పిల్లలకు స్నేహపూర్వక చట్టపరమైన సేవలు) పథకం–2024” కింద బాల్యవివాహాల నివారణ, పోక్సో చట్టం–2012, ఉచిత న్యాయ సహాయం, మధ్యవర్తిత్వం అంశాలపై న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలు …

Read More »

రూ.87.45 లక్షలతో ప్రభుత్వ బాలుర పరిశీలన వసతి గృహానికి శంకుస్థాపన

-మాదకద్రవ్యాలు, నేరాల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం -పుష్కరాల నిధులతో శాశ్వత అభివృద్ధి పనులు – స్థానిక సంస్థల ఎన్నికలు అవసరం -ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : నేటి సమాజంలో పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వస్తున్న తరుణంలో వారి ప్రవర్తన, పరిస్థితులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించుకోవాల్సిన అవసరం ఉందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బుధవారం రూరల్ లో పలు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా …

Read More »

రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్‌కు ఎస్సీ–ఎస్టీ ఉద్యోగ, వ్యక్తిగత మరియు ప్రజా సమస్యలపై వినతిపత్రాల సమర్పణ

-తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో అర్జీల స్వీకరణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాక్‌లాగ్ పోస్టులు, వసతి గృహాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్యలకు ఆదేశాలు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఎస్సీ–ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు మరియు ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు, వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు …

Read More »

రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో ఉద్యోగ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) సహకారంతో రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో ఉద్యోగ మేళాను 29-01-2026 (గురువారం) నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ఉదయం 10.00 గంటల నుండి గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, డౌలేశ్వరం నందు నిర్వహించబడుతుంది. ఈ ఉద్యోగ మేళాలో ఎనర్జీ, వేర్‌హౌసింగ్, అగ్రో ఇండస్ట్రీ, రైల్వే సపోర్ట్ సర్వీసులు, ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలకు …

Read More »

AP టూరిజం రీజినల్ డైరెక్టర్ (రాజమహేంద్రవరం) మరియు APTDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులకు ఎన్.వి.వి.ఎస్. మూర్తి నియామకం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువజనాభివృద్ధి, పర్యాటక మరియు సంస్కృతి (పర్యాటక) శాఖ జారీ చేసిన G.O.Rt.No.6, తేది: 06.01.2026 ప్రకారం, ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా DRDA, SERP ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్.వి.వి.ఎస్. మూర్తిని, అన్య శాఖల (forigne services) నిబంధనలు మరియు షరతుల ప్రకారం ఒక సంవత్సరం పాటు డిప్యుటేషన్ ప్రాతిపదికన, రీజినల్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ, రాజమహేంద్రవరం రీజియన్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (AP TDC), …

Read More »

జిల్లాలో “స్పర్శ” కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాల ప్రారంభం

-వివక్షతకు తావులేకుండా కుష్టు వ్యాధిగ్రస్తులను ఆదరించాలి -జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న కుష్టు నివారణ పక్షోత్సవాలు ఈ ఏడాది *“స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమం (SLAC)”*గా జనవరి 30, 2026 నుండి ఫిబ్రవరి 13, 2026 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలనీ …

Read More »

ఎన్.ఐ.ఆర్.డి లో ఎస్.హెచ్.జి మహిళలకు 10వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభం

-జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్, గిఫ్ట్ ఆర్టిక‌ల్స్, హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ విధానం పై శిక్ష‌ణ‌ -జ‌న‌వ‌రి 28 నుంచి ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు ఐదు రోజులు పాటు శిక్ష‌ణా కార్య‌క్ర‌మం -జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్, గిఫ్ట్ ఆర్టిక‌ల్స్ త‌యారీ లో శిక్ష‌ణ తీసుకుంటున్న 25 మంది ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు -హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ లో శిక్ష‌ణ పొందుతున్న 25 మంది ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు -శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌ను ప్రారంభించిన అసోసియేట్ ఫ్రోపెసర్ (సి.ఐ.ఎ.టి.ఎస్.జె -హెడ్) డాక్టర్ సి.కత్తిరేషన్ విజయవాడ, నేటి పత్రిక …

Read More »

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ పత్రాలు అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ 49 వ డివిజన్ ప్రైజర్ పేట కి చెందిన బోగవల్లి గాయత్రి లివర్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ తో బాధ పడుతోంది.. వైద్యులను సంప్రదించడంతో ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు.. ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్తానిక కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ సహకారంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను సంప్రదించారు.. ఆయన ఎమ్మెల్యే సుజనా చౌదరి తో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం లేఖను అందించారు.. దానికి …

Read More »

అమృత్ 2.0 పనులు పరిశీలించిన APUFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోగల అమృత్ 2.0 పనులను పురోగతిని APUFIDC (Andhra Pradesh Urban Finance Infrastructure Development Corporation)చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, డైరెక్టర్లు డాక్టర్ పి. చందన శ్రవంతి, వి. మార్కండేయ బాబు లతో విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ ఇంఛార్జ్ పి. సత్యకుమారి అద్వర్యం లో పరిశీలించారు. బుధవారం ఉదయం రామలింగేశ్వర నగర్, రాజీవ్ నగర్, కండ్రిక ప్రాంతాలన్ని అమృత్ 2.0 పథకం కింద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో …

Read More »