అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక తత్వవేత్త, సంగీత విద్వాంసుడు, ఆధునిక కవి భక్త కనకదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో కనకదాస జయంతిని సోమవారం ఘనంగా నిర్వహంచారు. ఈ సందర్భంగా కనకదాస జీవిత విశేషాలను, రాయలసీమలో కుల వ్యవస్థ, అసమానతలపై తన కీర్తనల ద్వారా ప్రజలను చైతన్యం తీసుకొచ్చిన విధానాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, …
Read More »All News
కురువలకు ఆరాధ్య దైవం భక్త కనకదాసు… : కలెక్టర్ రంజిత్ భాష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాస 537 జయంతి మహోత్సవంలో కర్నూల్ లోని బీసీ భవన్ నందు కనకదాసు విగ్రహానికి జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటలక్ష్మమ్మ, కల్లూరు మండలం తాసిల్దార్ ఆంజనేయులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు కనకదాసు విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్ కమిటీ హాల్ కనకదాస కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ కురువలకు ఆరాధ్య దైవమైన భక్త …
Read More »మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా ఉండవల్లి శ్రీదేవి బాధ్యతల స్వీకారం
తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : మాదిగ కార్పొరేషన్ మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్ పర్సన్ గా ఉండవల్లి శ్రీదేవి సోమవారం తాడేపల్లి బైపాస్ రోడ్ లోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ… ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దళిత సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కి పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా నిర్వహిస్తానని …
Read More »ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టి, పరిష్కరించాలి
– పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 97 అర్జీలు. – జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా అందే ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కరించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డా. నిధి …
Read More »స్వయం కృషితో అందరి సహకారంతో ఈ స్థాయికి వచ్చా
-దేశంలోనే నెంబర్ 1 స్టేట్ గా స్వచ్ఛాధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దుతా -విలువలతో కూడిన జీవితాన్ని నేర్పింది నా తండ్రి- అదే నా ఎదుగుదలకు కారణం -నేటి యువత ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాలి -స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేటి యువత సామాజిక స్రృహ కలిగి ఉండటంతోపాటు ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకోవాల్సిన అవసరం ఉందని స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్చంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ గా కొమ్మారెడ్డి …
Read More »భక్త కనకదాస కీర్తనలు.. ప్రజా చైతన్యానికి సూచికలు..
-ఎన్‌టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని ప్రతిఒక్కరికీ అర్థమయ్యేలా సంగీత సాహిత్యాలతో అనుసంధానం చేసి తత్వజ్ఞానాన్ని అందించేందుకు, తన కీర్తనలతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు విశేష కృషిచేసిన కవి, సంగీతకారుడు, స్వరకర్త శ్రీ భక్త కనకదాస జీవితం ఆదర్శప్రాయమని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా అన్నారు. శ్రీ భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ …
Read More »అభివృద్ధికి అండగా ఉంటా
-ఎంఎల్ఎ సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వస్త్రలతలోని సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి అండగా ఉంటానని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సోమవారం ఎమ్మెల్యే సుజనా పాల్గొన్నారు. అసోసియేషన్ మధ్య అద్దె బకాయిల అంశం లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించి సలహాలు సూచనలను స్వీకరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో చందాలు, దందాలు లేకుండా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చని సుజనా హామీ ఇచ్చారు. వస్త్రలతకు సంబంధించిన సమస్యలు, కాంప్లెక్స్ …
Read More »డిపాజిటర్ల ఆర్థిక ప్రయోజనాలు కాపాడాలి
-ఎం ఎల్ ఎ సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల రిజర్వ్ బ్యాంకు ఆంక్షలు విధించిన దుర్గ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సోమవారం సందర్శించారు. డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి , సి ఈ ఒ బంకా శ్రీనివాస్ తో కలిసి చర్చించారు. బ్యాంకు లోని అవకతవకల గురించి, డిపాజిటర్లతో, బ్యాంకు సిబ్బందితో మాట్లాడి బ్యాంకు ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు. డిపాజిట్లను విత్ డ్రా చేసుకునే అవకాశం …
Read More »పశ్చిమ లో ఎమ్మెల్యే సుజనా చౌదరి సుడిగాలి పర్యటన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) సోమవారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. చిట్టినగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సుజనా చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వసతులను ఆయన పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై అరా తీసి రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయవలసిన అభివృద్ధి గురించి చర్చించారు.అనంతరం 151,146 సచివాలయాలను సందర్శించి వెల్ఫేర్ సెక్రెటరీ, విఆర్ఓ, అడ్మిన్ సిబ్బందిని సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలను …
Read More »సుజనా చౌదరి ఔదార్యం
-మృతుల కుటుంబానికి ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు కార్యాలయ సిబ్బంది ఆర్థిక సాయం చేశారు.38 వ డివిజన్ కుమ్మరిపాలెం కు చెందిన టిడిపి యూనిట్ ఇంచార్జ్ కంభంపాటి దుర్గారావు 63 కేదారేశ్వర పేటకు చెందిన లోకేష్ 17 ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారికి ఆర్థిక సాయం అందజేయాలని 38వ డివిజన్ టిడిపి అధ్యక్షురాలు పితాని పద్మ , టిడిపి నాయకులు రాఘవేంద్రరావు …
Read More »