అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యసభ ఎంపి అభ్యర్థిగా జనసేన పార్టీ తరుపున లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈమేరకు శనివారం అమరావతి అసెంబ్లీ భవనంలో లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణికి అందచేశారు. ఈ నామినేషన్ దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపి అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఒక సెట్ నామినేషన్ ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం. …
Read More »All News
ఇబ్బందులకు తెర.. ఎల్ఏ సాగరం వద్ద రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
-తిరుపతి ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి స్పందన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి-71 ఆరు లేన్ల విస్తరణ పనుల కారణంగా నాయుడుపేట సమీపంలోని మందబయలు, కారుమంచివారి ఖండ్రిగ, కానూరు, తాళ్వాయపాడు హరిజనవాడ గ్రామాలతో పాటు అవని అపార్ట్‌మెంట్‌కు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సంబంధిత గ్రామాల ప్రజలు, అవని అపార్ట్‌మెంట్ నివాసితులు ఈ ఫిబ్రవరిలో తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసి సమస్యను వివరించారు. నాయుడుపేట సమీపంలోని ఎల్ఏ సాగరం వద్ద బాక్స్ బ్రిడ్జ్ నిర్మించినప్పటికీ సర్వీస్ రోడ్డు …
Read More »కార్యకర్తే పార్టీకి వెన్నెముక – ఎంపీ చిన్ని
-లోకేష్ తరహా లో ఎంపీ చిన్ని కొత్త ట్రెండ్ -కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు కొత్త బాట -ప్రతి రోజు నాయకులు కార్యకర్తల తో ఆత్మీయ సమావేశం -వత్సవాయి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఎంపీ చిన్ని ఆత్మీయ విందు -క్యాడర్ తో కలిసి మెలిసి సహాపంక్తి భోజనం చేసిన ఎంపీ చిన్ని ఎమ్మెల్యే తాతయ్య -72 నాయకలు కార్యకర్తల తో మందితో ఏక కాలం లోనే భేటీ -ఇంటికి పిలిచి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే నాయకుడు ఎంపీ చిన్ని నే అంటున్న కార్యకర్తలు విజయవాడ, …
Read More »విజయవాడను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతాం
-“విజయవాడలో క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తాం!” -“ఆధునికరణతో ఇండోర్ స్టేడియంను రాష్ట్రంలోనే ఆదర్శ క్రీడా వేదికగా మారుస్తాం” -విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్తులో విజయవాడను రాష్ట్రంలోనే ప్రముఖ *“స్పోర్ట్స్ సిటీ”*గా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ స్పష్టం చేశారు. క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.“విజయవాడ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే …
Read More »ఉండవల్లిలో రహదారులను పరిశీలించిన అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : APCRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ శనివారం ఉదయం రాజధాని అమరావతి- ఉండవల్లిలో పర్యటించారు. గ్రామంలోని మూల మలుపుల వద్ద రహదారి విస్తరించేందుకు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో..APCRDA సమాయత్తమైంది. ఈ ప్రణాళికల అమలుకై గ్రామంలో రహదారికి సమీపంగా ఉన్న పలు స్థలాలు, నివాస గృహాలను కార్తీక్, CRDA స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏ.జి. చిన్నికృష్ణ తో కలసి పరిశీలించారు. గ్రామంలో పర్యటిస్తున్న అడిషనల్ కమిషనర్ వద్దకు పలువురు గ్రామస్తులు, రైతులు వచ్చి వారి సమస్యలను …
Read More »సిఆర్డిఏ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్న యువత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) ఆధ్వర్యంలో తుళ్లూరులోని స్కిల్ హబ్ కార్యాలయంలో శనివారం జాబ్ మేళా జరిగింది. జాబ్ మేళాలో స్కిల్ దునియా, APNRT, PVP స్టాఫింగ్, ముత్తూట్ ఫైనాన్స్, టెక్నో టాస్క్ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ 5 కంపెనీలలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. జాబ్ మేళాకు 44 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 33 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో APNRT సంస్థకు 22, PVP స్టాఫింగ్ …
Read More »రాజధాని అమరావతి నగర పరిధిలో ఆక్రమణల తొలగింపుకై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన APCRDA
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నగర అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా, అమరావతి జోనింగ్ నిబంధనల అమలులో భాగంగా APCRDA అధికారులు శనివారం ఆక్రమణల తొలగింపుకై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో నిర్వహించారు. డ్రైవ్‌లో భాగంగా రహదారులు, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ భూములపై ఉన్న అనధికార ఆక్రమణలను గుర్తించి తొలగించారు. ప్రజల రాకపోకలకు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న కంటైనర్లు, తాత్కాలిక షెడ్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తదితర నిర్మాణాలను APCRDA సిబ్బంది, సంబంధిత శాఖల …
Read More »పర్యావరణ మనుగడ అందరి బాధ్యత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ముడిపడి ఉందని ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని ప్రాణంతో సమానంగా కాపాడుకోవాలని అసిస్టెంట్ కమిషనర్ లేబర్ బి.అనితా వాణి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటపాలెంలోని చిగురు ఆశ్రమంలో ఎల్ అండ్ టీ కంపెనీ ఆధ్వర్యంలో ఏపీ సీఆర్డీఏ – ఏడీసీ ఈఎస్ఎంయూ విభాగం ఆధ్వర్యంలో అనాధ బాలలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శనివారం జరిపారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని బాలలకు పండ్లు, పండ్ల రసాలు ఎల్ అండ్ టీ ప్రతినిధులు …
Read More »ఘనంగా రైతులు, డ్వాక్రా మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌరవరం మంగోలు మరియు కృష్ణ ఫార్మసీ సొసైటీల ఆధ్వర్యంలో రైతులు మరియు డ్వాక్రా మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో కృష్ణా సొసైటీలో సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన చెక్కులను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాజీ మంత్రి నెట్టెం రఘురాం మరియు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ “రైతులు మరియు డ్వాక్రా మహిళా …
Read More »ఈ నెల 7 నుంచి యోగా పోటీలు..
– తొలిదశలో గ్రామ, వార్డు స్థాయిలో ఉత్సాహంగా ఆరంభం – ఔత్సాహికులు పెద్దఎత్తున పాల్గొనాలి – యోగాంధ్ర-2026ను విజయవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని ప్రతి వర్గానికి యోగా పట్ల అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహించే యోగాంధ్ర-2026లో భాగంగా ఈ నెల 7 నుంచి యోగా పోటీలు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని …
Read More »
Prajavartha Online Telugu News