Breaking News

Andhra Pradesh

వార్డ్ వాలెంటీర్ల కొరకు ధరఖాస్తులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలకసంస్థ పరిధిలోని వివిధ వార్డుల యందు సుమారు 196 మంది వార్డ్ వాలెంటిర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగయువతీ, యువకుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చు నని నగర కమిషనర్, స్వ ప్ని ల్ దినకర్ పుండ్క ర్.,ఐ.ఏ.ఎస్ ఈ ప్రకటన ద్వారా తెలియజేసారు. వార్డ్ వాలెంటీర్ల కొరకు ధరఖాస్తు చేసుకొనే వారు 10 వతరగతి (SSC) ఉతీర్ణులై ఉండవలెనని, 19-05-2022 నాటికి 18 సంవత్సరములు నిండి, 35 సంవత్సరములు లోపు గలవారై …

Read More »

పర్యాటకులను ఆకర్షించేలా గాంధీ కొండ అభివృద్ధికి చర్యలు

-ఆకర్షణియంగా తీర్చిదిద్దుటకు డిజైన్ మరియు ప్రణాళికలను రూపొందించాలి -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సోమవారం అధికారులతో కలసి నగరంలోని పలు వీధులలో పారిశుధ్య నిర్వహణ తీరు, గాంధీ హిల్ మరియు గాంధీనగర్ నందలి సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ నందలి ఆధునీకరణ పనుల పురోగతిని పర్యవేక్షించారు. గాంధీ కొండ దిగువ ప్రాంతము మరియు కొండపైకి వెళ్లు ఘాట్ రోడ్, కొండ పై …

Read More »

ప్రజల నాడిని పసిగట్టేవి చిన్న పత్రికలే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నాడిని పసిగట్టేవి చిన్న పత్రికలే అని అటువంటి చిన్న పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలని వాణిజ్య ప్రకటనలద్వారా సహకరిచాలని IJU అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి ఉద్బోధించారు. చిన్న పత్రికలో నైనా, పెద్దపత్రికలో నైనా, సత్యం సత్యమే నని ఆయన నొక్కి వక్కాణించారు. ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన నీలి మేఘం వారపత్రిక 5 వ వార్షికోత్సవ సభలో IJU ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు అధ్యక్షతన వహించారు. IJU అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి …

Read More »

తొలిరోజు దావోస్‌లో బిజీబిజీగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్…

-పలువురు ప్రముఖులతో వరుస సమావేశాలు -ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన సీఎం -విద్యా, వైద్యరంగాల్లో ఏపీ ప్రగతిపై పలువురి ప్రశంసలు -పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఇలాంటి విధానాలు దోహదపడతాయన్న ప్రముఖులు దావోస్‌, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిరోజు బిజీబిజీగా గడిపారు. పలు అంశాలపై చర్చలు జరిపారు. డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తయారీ రంగంలో అత్యాధునికతకు సంతరించుకోవడానికి వీలుగా, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. కాలుష్యంలేని ఇంధనాల …

Read More »

నగరి నియోజకవర్గ క్రీడా సంబరాలను ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా…

నగరి, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలను ఆడడం ద్వారా ఆరోగ్యం, సంతోషం మాత్రమే కాకుండా మెడల్స్, అవార్డులు, ప్రైజస్ లాంటి గుర్తింపు పథకాలు కూడా లభిస్తుందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. కులాలు, మతాల‌కు సంబంధం లేకుండా అందరూ కలిసి కట్టుగా పాల్గొనే ఒకే ఒక్క ప్రధానమైన అంశం ఈ క్రీడలు మాత్రమే అని తెలిపారు. ఆదివారం నగరి డిగ్రీ కళాశాల మైదానంలో శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) వారి ఆధీనంలోని క్రీడా వికాస మైదానాలు, భవనాలలో జరుగనున్న”సమ్మర్ క్యాంప్” పోటీలను …

Read More »

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారికి శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారికి 80 సంవత్సరాలు వచ్చాయి.  ఆచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారు… మైసూర్ స్వామివారి ఆశ్రమానికి వెళ్లి వారిని ప్రత్యక్షంగా కలిసి తిరునక్షత్ర శుభాకాంక్షలు తెలిపారు. సచ్చిదానంద స్వామివారు… వారి మృదు మధురమైన మాటలతో, సామాన్య ప్రజాను ఆనందింప చేస్తారు. సంగీతంతో అవసరమైన వారికి ఆరోగ్యాన్ని-ఆనందాన్ని పంచుతారు. ఎంతో మందికి వారి పాటలు తాత్వికమైన ఆనందాన్ని కలుగజేస్తాయి.

Read More »

సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 42వ డివిజన్ లోని ప్రియదర్శిని కాలనీ నందు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పోస్టర్ ను  మాజీమంత్రి, ఎన్.టి.ఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, స్టాండింగ్ కమిటీ సభ్యులు పడిగపాటి చైతన్య రెడ్డి, కార్పొరేటర్లు, మరుపిళ్ల రాజేష్, …

Read More »

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు హర్షణీయం…

-కేంద్ర మార్గాన్ని వైసీపీ ప్రభుత్వం అనుసరించాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోజు రోజుకీ పెరుగుతున్న ధరల దాడికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని భావిస్తున్నాను. పెట్రోలు, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంలోని అధినాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనసారా ఆహ్వానిస్తున్నాను. ఫలితంగా పెట్రోలు రూ.9.50 పైసలు, డీజిల్ రూ.7 వరకు తగ్గడం హర్షణీయం. నిత్యావసర ధరల పెరుగుదలకు ఇంధన రేట్లే కారణమన్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసర వస్తువుల …

Read More »

బాలల సంరక్షణకు మరింత శ్రద్ద వహించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలల అక్రమ రవాణా బాలికల పై లైంగిక వేదింపులు బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థల నిర్మూలనకు అధికారులు స్వచ్చంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. జిల్లా బాలల సంరక్షణ కమిటితో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు బాలల సంరక్షణ పై తీసుకోవాల్సిన చర్యలపై గూగుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో బాలల సంరక్షణ కమిటి సభ్యులు సమర్థవంతంగా పనిచేసి బాలల సంరక్షణకు మరింత శ్రద్ద వహించాలన్నారు. బాలల పై …

Read More »

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో తొలి రోజున బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌పాల్‌ బక్నర్‌తో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

దావోస్‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో తొలి రోజున బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌పాల్‌ బక్నర్‌తో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. హాన్స్‌పాల్‌ బక్నర్‌. బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ మాట్లాడుతూ విద్య, వైద్య ఆరోగ్యం రంగాలతో పాటు, రాష్ట్రంలో తగిన మౌలిక వసతుల కల్పన, వివిధ సంస్థల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చూపుతున్న చొరవ, ఆ దిశలో చిత్తశుద్ధితో చేస్తున్న కృషి తప్పనిసరిగా సానుకూల ఫలితాలనిస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు సమకూరుతాయి. తద్వారా రాష్ట్రంలో ఉద్యోగ, …

Read More »