Breaking News

పర్యాటకులను ఆకర్షించేలా గాంధీ కొండ అభివృద్ధికి చర్యలు

-ఆకర్షణియంగా తీర్చిదిద్దుటకు డిజైన్ మరియు ప్రణాళికలను రూపొందించాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సోమవారం అధికారులతో కలసి నగరంలోని పలు వీధులలో పారిశుధ్య నిర్వహణ తీరు, గాంధీ హిల్ మరియు గాంధీనగర్ నందలి సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ నందలి ఆధునీకరణ పనుల పురోగతిని పర్యవేక్షించారు. గాంధీ కొండ దిగువ ప్రాంతము మరియు కొండపైకి వెళ్లు ఘాట్ రోడ్, కొండ పై ప్రజలకు అందుబాటులో గల ఆట పరికరాలు మొదలగు వాటిని పరిశీలించిన సందర్భంలో కొండపై ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా తీర్చిదిద్దుటకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందుకు కొండపైకి వెళ్లు ఘాట్ రోడ్ నందలి సెక్యురిటి ద్వారా ప్రజలకు ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కల్పించే విధంగా చూడాలని అన్నారు. అదే విధంగా ఘాట్ రోడ్ అంచుల వెంబడి గల గోడలు కొన్ని చోట్ల ఎత్తు తక్కువగా మరియు కొన్ని చోట్ల గోడలు లేకుండా ఉండుట గమనించి గోడలను ఎత్తు పెంచాలని మరియు అవసరమైన ప్రదేశాలలో గోడల నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంలో గాంధీ హిల్ ఫౌండేషన్ వారితో సమావేశం ఏర్పాటు చేయుటతో పాటుగా పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమగు డిజైన్ మరియు ప్రణాళికలను రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తదుపరి బి.ఆర్.పి రోడ్, గణపతిరావు రోడ్, నెహ్రు రోడ్ మొదలగు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలిస్తూ, గణపతిరావు రోడ్ నందు ఎక్కువగా ఆవులు ఉండుట గమనించి పశువుల యజమానులు ఎవరు పశువులను రోడ్లపైకి వదలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గాంధీనగర్ నందలి సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ నందలి పనుల పురోగతిని పర్యవేక్షించి అధికారులను పనుల వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, వి.శ్రీనివాస్ మరియు శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *