Breaking News

Andhra Pradesh

ఇంద్రకీలాద్రి పై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం. నేటి నుంచి మూడు రోజులపాటు శాకంబరీ ఉత్సవాలు. కూరగాయల అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తారు.  అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. దాతలు, రైతులు, వ్యాపార వర్గాల నుంచి విరాళంగా కూరగాయలు, పండ్లు దుర్గగుడి  అధికారులు సేకరించారు. శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు సందర్భంగా దేవస్థానం మరియు ప్రాంగణములు యందు ఆకుకూరలు మరియు కూరగాయలుతో అలంకరణ చేశారు.

Read More »

YSR Kapu Nestham: వరుసగా రెండోసారి వైఎస్సార్ కాపు నేస్తం.. రేపు!

YSR Kapu Nestham

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : YSR Kapu Nestham: రేపు(22.07.2021, గురువారం) వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3,27,244 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ. 490.86 కోట్ల ఆర్ధిక సాయం అందించబోతున్నారు. అమరావతిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో రేపు కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్‌. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఈ …

Read More »

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. పొంగి పొర్లుతున్న వాగులు

heavy rains

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : Heavy Rains: రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 1,10,239 ఉండగా ఔట్‌ఫ్లో 28,252 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్‌ ఇన్‌ఫ్లో 31,512, ఔట్‌ఫ్లో 1,555 క్యూసెక్కులుగా ఉంది. ఇక ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో …

Read More »

ముస్లీం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారన్నారు. భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి  జగన్‌ ఆకాంక్షించారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అభిలషించారు.

Read More »

ముస్లీం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదర సోదరీ మణులకు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) శుభాకాంక్షలు తెలిపారు.‘త్యాగం, సహనం, ఐక్యమత్యానికి ప్రతీక బక్రీద్’ అని అన్నారు. పవిత్ర ఇస్లానిక్ గ్రంధాల ప్రకారం తన ప్రియమైన వస్తువును త్యాగం చేయమని దేవుడు చెప్పినప్పుడు ప్రవక్త అబ్రహం తన కుమారుడు ఇస్మాయిల్ ను త్యాగం(బలి) చేయడానికి సిద్ధపడతాడు. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ …

Read More »

త్యాగాలకు ప్రతీక బక్రీద్ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి పట్ల సంపూర్ణ భక్తి విశ్వాసాలు, పేదల పట్ల దయ, దాతృత్వానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని అభివర్ణించారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్కరూ సామాజిక దూరం పాటించి ప్రార్థ‌న‌ల్లో పాల్గొనాల‌ని కోరారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు  ఆకాంక్షించారు.

Read More »

బక్రీద్ పండుగ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపాలి… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బక్రీద్ పండుగ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపాలని, అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆకాంక్షించారు. ముస్లిం సోదర సోదరీమణులకు కలెక్టర్ జె. నివాస్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశమన్నారు. అదేవిధంగా కోవిడ్-19 వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో థర్డ్‌ వేవ్‌ అవకాశం ఉండటంతో బక్రీద్ పండుగ వేడుకలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలని ముస్లిం సోదరులకు ఆయన సూచించారు. భారీ జన సమూహాలను నివారించేందుకు …

Read More »

నిరుపేదలకు బియ్యము, చీరలు, కూరగాయలు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 60వ డివిజన్ వాంబే కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణ హోటల్ సెంటర్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీమ్ వారి సౌజన్యంతో Ln.వి.అప్పలరాజు  జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా కరోన కష్ట కాలంలో ఉన్న ప్రజలకు బియ్యము, చీరలు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. రామరాజు మాట్లాడుతూ ప్రతీనిత్యం సేవా కార్యక్రమాలు చేస్తున్న అప్పలరాజు ని అభినందిస్తూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు. అప్పలరాజు  మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ …

Read More »

విద్యార్థుల్లో వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి…

– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల్లో వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి కోసం కృషి జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గేమ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో విద్యార్థులకు చేపట్టిన వ్యాపార వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 9 నుండి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు నాయక ఉన్న త్వం పేరుతో వ్యాపార వ్యవస్థాపక …

Read More »

ప్రజాసమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా పరిష్కార వేదిక : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరానికి జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టినట్లు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం రెండవ రోజు 22 వ డివిజన్ లో పరిష్కర వేదిక కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి తో కలిసి దేవినేని అవినాష్ ప్రజల సమస్యలను, సంక్షేమ పథకాలు అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణలంక ప్రాంతం వైస్సార్సీపీ కి కంచుకోట …

Read More »