విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బక్రీద్ పండుగ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపాలని, అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆకాంక్షించారు. ముస్లిం సోదర సోదరీమణులకు కలెక్టర్ జె. నివాస్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశమన్నారు. అదేవిధంగా కోవిడ్-19 వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో థర్డ్ వేవ్ అవకాశం ఉండటంతో బక్రీద్ పండుగ వేడుకలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలని ముస్లిం సోదరులకు ఆయన సూచించారు. భారీ జన సమూహాలను నివారించేందుకు ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్ధనలు చేయడానికి అనుమతి లేదని, మసీదుల్లో మాత్రమే ప్రార్ధనలకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. భౌతిక దూరం పాటిస్తూ.. మసీదుల్లో మాస్కులు ధరించి 50 శాతం మందితో ప్రార్ధనలు నిర్వహించుకోవాలని తెలిపారు. కరోనా వైరస్ దృష్ట్యా ప్రజలు జాగ్రత్త వహించాలని, సాధ్యమైనంత వరకూ ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. మసీదు నిర్వాహకులు ప్రాంగణాల్లో శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచాలన్నారు. వృద్ధులు, పిల్లలు ఇంటి వద్ద ప్రార్ధనలు చేసుకోవాల్సిందిగా సూచించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో మటన్ షాప్ లో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని,శానిటైజేషన్,బ్లీచింగ్ చేయించాలని,అలాగే మాంసం విక్రయ కేంద్రాల్లోనూ కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని, అధికారులను ఆదేశించారు.
Tags vijayawada
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …