Breaking News

Devotional

ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి

-శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు తెలిస్తే…తప్పక దర్శించుకోవాలనుకుంటారు… అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి. దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది.’ అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. కైలాసగిరుల ప్రదక్షిణ కోసం ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి క్షేత్రమహాత్యం గురించి వివరించారు. ఆ విశేషాలివీ… శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. …

Read More »

శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మస్థలం అంజనాద్రి

తిరుమ‌ల‌, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మస్థలం అంజనాద్రి అని పౌరాణిక‌, వాఙ్మ‌య‌, శాస‌న‌, భౌగోళిక ప్రమాణాల‌తో టిటిడి నిరూపించింది. ఈ మేర‌కు పండితుల క‌మిటీ త‌యారుచేసిన నివేదిక‌ను శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మానికి విచ్చేసిన త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ భ‌న్వారిలాల్ పురోహిత్‌ మాట్లాడుతూ శ్రీ‌రాముని జ‌న్మ‌స్థానం అయోధ్య అని, ఇక‌పై రామ భ‌క్తుడైన హ‌నుమంతుని జ‌న్మ‌స్థానం తిరుమ‌ల అన్నారు. టిటిడి ఈ విష‌యాన్ని శాస్త్రబ‌ద్ధంగా నిరూపించింద‌న్నారు. తాను హ‌నుమంతుడి భ‌క్తుడిన‌ని, ఈ విష‌యం …

Read More »

శ్రీ పాండురంగస్వామి(విఠల్ రుఖ్మిని) ఆలయం

నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పాండురంగస్వామి(విఠల్ రుఖ్మిని) ఆలయం, పండరీపురం, మహారాష్ట్ర. భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో దేని విశిష్టత దానిది. వీటిలో కొన్ని శైవక్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన తిరుమలగా మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ‘విఠోబా’ పేరుతో వెలసియున్నాడు. విఠోబా లేక వితోబా అనే పేరు పురాణాలలో కూడా ఉంది. మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా …

Read More »

శ్రీ తుల్జాపూర్ భవానీ ఆలయం….

నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ తుల్జాపూర్ భవానీ ఆలయం, ఉస్మానాబాద్, మహారాష్ట్ర. తుల్జా భవానీ ఆలయం మహారాష్ట్రలో ముఖ్యమైనది మరియు అత్యంత గౌరవనీయమైన దేవత. ఇది మహారాష్ట్రలోని తుల్జాపూర్ జిల్లా ఉస్మానాబాద్ వద్ద ఉంది. ఇది మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల్లోని అనేక కుటుంబాలలో కుటుంబ దేవత (కులదేవత). ‘తుర్జా’ అని కూడా పిలువబడే తుల్జాభావని మహారాష్ట్రకు చెందిన దేవత మరియు భారతదేశానికి యాభై ఒక్క శక్తిపీఠాలలో ఒకటి. యాత్రికులు మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి తుల్జాపూర్ వస్తారు. తుల్జా భవానీ …

Read More »

బ్రిటిషు వాళ్ళు..చంపిన కూడా స్వామివారి.. మొసలి (బబియా) తిరిగి..బ్రతికింది..!!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి మొసలి భక్తులలో భగవంతునిపై నమ్మకాన్ని పెంపొందిస్తోంది. కేరళలోని కాసరగోడ్ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలోని కొలనులో కేవలం స్వామి వారి ప్రసాదాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించే శాకాహార మొసలి ” బబియా ” నేటికి మనకు దర్శనమిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఎవరికీ హాని చేయని మొసలి స్వామి వారి ప్రసాదం తప్పా ఇంకేమి తినదు. నీళ్ళలోకి దిగి ఆ మొసలి నోటికి ప్రసాదాన్ని …

Read More »

విష్ణువు మూర్తి యొక్క అద్భుతమైన విగ్రహం

నేటి పత్రిక ప్రజావార్త : విష్ణువు మూర్తి యొక్క అద్భుతమైన విగ్రహం ఒకటి కర్ణాటకలో సక్లేషపూర్ అనే గ్రామంలో గ్రామస్తులు వేటి గురించో తవ్వుతూ బయటపడింది. అదృష్టవశాత్తూ తవ్వకాలలో ఎక్కడా దెబ్బ తగలకుండా విగ్రహం పూర్తి రూపంతో అద్భుతమైన స్థితిలో ఉంది. ఇది హొయసల కాలంలో చెక్కబడిన వాసుదేవుడు లా కనిపిస్తున్నాడు. చుట్టూ వున్న అర్చి వంటి దానిలో అందమైన సూక్ష్మ మైన దశావతారాలను కూడా చెక్కారు గమనించండి! అప్పటి విదేశీయుల దండయాత్రలు నుండి కాపాడుకుందికి బహుశా భూమి లోతుల్లో ఇసుక పారల మధ్య …

Read More »

పరిపూర్ణ అవతారమూర్తి శ్రీ కృష్ణుడు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ పరమాత్మ గోపికలలో చేసిన రాసలీలల గురించి ప్రజా బాహుళ్యంలో ఉన్న కథనాలన్నీ కేవలం అపోహలు మాత్రమేనని, జీవాత్మ పరమాత్మను చేరుకోవటమే రాసలీలలోని అంతరార్థమని విఖ్యాత పండితులు ‘అద్వైతసిద్ధి రత్నాకర’ మద్దులపల్లి దత్తాత్రేయశాస్త్రి అన్నారు. ప్రముఖ వ్యాపారవేద్త, వేదపోషకులు మాగంటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన లబ్బీపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానంలోజరుగుతున్న అష్టోత్తరశత (108) భాగవత పారాయణ, ప్రవచన మహాయజ్ఞం ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం నాటి కార్యక్రమంలో తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక …

Read More »

ఘనంగా శ్రీలక్ష్మిఅమ్మవారి తిరునాళ్ల వేడుకలు

అమరావతి‌, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని బుచ్చిపాపయపాలెం గ్రామంలో శ్రీ నీలంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి తిరునాళ్ళ వేడుకలు. ఆలయ పుజారి సత్యం అయ్యగారు మరియు ధర్మకర్త చీమల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దాదాపు 5 సంవత్సరాలుగా ఈ శ్రీలక్ష్మి అమ్మవారి కి తిరునాళ్ళ వేడుకలు నిర్వహిస్తున్నామని గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామని వేలాది మంది మహిళా భక్తులు వచ్చి పుజాకార్యక్రమాలు నిర్వహించారని అదేవిధంగా అమ్మవారికి కుంకుమ బండ్లు ప్రభలు కూడా ఏర్పాట్లు చేసినట్లు …

Read More »

శివ పూజ విశేషం…

నేటి పత్రిక ప్రజావార్త : శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటిపశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి, అంతటి బోళాశంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా?! ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మసంగ్రాహం, శివరహస్యఖండం, లింగపురాణం, కార్తీకమాహాత్మ్యం గ్రంథాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఆ గ్రంథాలు ఇలా చెబుతున్నాయి. శివుని పుష్పాలతో పూజిస్తే, పది అశ్వమేధ …

Read More »

8 నెలల తర్వాత భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడు   

-గతేడాది జులై 19న చివరిసారి దర్శనం -రేపటి నుంచి పూర్తిస్థాయిలో పూజలు నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లాలో కృష్ణమ్మ ఒడిలో కొలువైన సంగమేశ్వరస్వామి 8 నెలల తర్వాత భక్తులకు నిన్న తొలిసారి దర్శనమిచ్చారు. గతేడాది జులై 19న ఆలయంలో కృష్ణానది నీటిలో ఒదిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించింది. శ్రీశైల జలాశయ నీటి మట్టం 839 అడుగులకు చేరుకోవడంతో సంగమేశ్వర ఆలయం ప్రహరీ, ముఖద్వారం, ఆలయంలోని దేవతామూర్తులు కనిపించాయి. వేపదారు శివలింగం మాత్రం అడుగు మేర నీటిలోనే …

Read More »