Breaking News

Latest News

భక్తులతో కిటకిటలాడిన చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రావణ శుక్రవారం,వరలక్ష్మి వ్రతం సందర్భంగా చిట్టి నగర్ లోని శ్రీ మహాలక్ష్మి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం తెల్లవారుజామునుంచే భక్తులు, ముఖ్యంగా మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి తరలివచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు (పిసి) మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారని చెప్పారు. …

Read More »

ఇంద్రకీలాద్రిలో శ్రావణమాసం వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయంలో అమ్మవారికి విశేష అలంకరణ, పూజలు నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తులు లక్ష కుంకుమార్చనలు, ఖడ్గమాల చేయించుకున్నారు. అలాగే విశాఖలోని అమ్మవారి ఆలయాల్లో వరలక్ష్మీ వ్రత శోభ సంతరించుకుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలు, పంచామృతాలతో అభిషేకం …

Read More »

అడిగిన వెంటనే ఆదుకున్న మనసున్న మారాజు మా జగనన్న – ఒక తల్లి ఆనందం.

పాయకరావుపేట/తుని/కాకినాడ,  నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాయకరావు పేటలో వివాహ కార్యక్రమానికి హజరైన సందర్భంగా మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఒక బాలుడి పరిస్థితి, అతడి తల్లి ఆవేదన చూసి చలించి తక్షణ ఆర్థిక సహాయం, వికలాంగ పింఛను మంజూరుకు కాకినాడ జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లాకు సూచించారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం, మండపం గ్రామానికి చెందిన మహిళ నక్కా తనూజ 10 ఏళ్ల కుమారుడు నక్కా ధర్మతేజ పుట్టినప్పటి నుండి మానసిక వైకల్యంతో …

Read More »

ప్రభుత్వ ప్రధాన్యత భవన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం…

-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రభుత్వ ప్రధాన్యత భవన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పనుల ప్రగతి పై సమీక్షించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరి గోపాల కృష్ణ ద్వివేదికి వివరించారు. ప్రభుత్వ ప్రధాన్యత భవన నిర్మాణాలు, జలజీవన్‌ మిషన్‌, ఉపాధి హామి పనుల ప్రగతి, జగనన్న స్వచ్ఛసంకల్పం తదితర అంశాల పై రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరి గోపాల కృష్ణ ద్వివేది, …

Read More »

నవంబరులో “పాలి టెక్-ఫెస్ట్” 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసి నూతన ఆవిష్కరణలు చేసే దిశలో ప్రోత్సహించేందుకు గాను, విద్యా సంవత్సరం 2022-23 కు సంబంధించి నవంబరు నెలలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలోని విద్యార్థులకు టెక్నికల్ ఫెస్ట్(POLY TECH FEST-2022) నిర్వహించేందుకు నిర్ణయించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ డా. పోలా భాస్కర్ గారు తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థుల శాస్త్రీయ ఆలోచనలకు, వినూత్న స్ఫూర్తికి ఈ టెక్నికల్ ఫెస్ట్ వేదికగా ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. టెక్ ఫెస్ట్ ను జిల్లా మరియు …

Read More »

సమగ్ర భూ సర్వే ప్రక్రియ వేగవంతం …

-7 గ్రామాలలో 13 నోటిఫికేషన్‌ పూర్తి.. -మరో 7 గ్రామాలలో భూ సర్వే తుది దశలో ఉందని .. -సిసిఎల్‌ ఏ అధికారులతో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సమగ్ర భూ సర్వే పనులు ప్రణాళికబద్దంగా వేగవంతం చేస్తున్నామని ఇప్పటికే 7 గ్రామాలలో 13 నోటిఫికేషన్‌ పూర్తి చేశామని మరో 7 గ్రామాలలో భూ సర్వే తుది దశలో ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌కు వివరించారు. …

Read More »

రానున్న రోజుల్లో మెరుగైన స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు కృషి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జువైన‌ల్ హోమ్‌లో చ‌ట్టంతో విభేదించ‌బ‌డిన బాల‌ల సౌక‌ర్యార్థం మౌలిక వ‌స‌తులను మ‌రింత మెరుగుప‌రిచేందుకు కృషి చేస్తామ‌ని రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలు బూసి వినీత అన్నారు. విద్యాధ‌ర‌పురంలోని క‌బేళా సెంట‌ర్‌లో ఉన్న గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ జువైన‌ల్ వెల్ఫేర్ అండ్ క‌ర‌క్ష‌న‌ల్ స‌ర్వీసెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది స్ట్రీట్ చిల్డ్ర‌న్ హోంను గురువారం మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలు బూసి వినీత సంద‌ర్శించి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ బాల‌ల‌కు అందుతున్న సౌక‌ర్యాల క‌ల్ప‌న‌లో …

Read More »

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం

-విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నూతన జడ్జీలతో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నూతనంగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేశారు. క్రొత్త జడ్డీలతో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం ఏడుగురు నూతనంగా ప్రమాణం చేయగా, వారిలో నలుగురు న్యాయమూర్తులుగా, ముగ్గురు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటగా జస్టిస్‌ అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు ప్రమాణం చేశారు. ఆ …

Read More »

ఉదారత చాటుకున్న జనసేన మైనార్టీ నాయకులు గయాజుద్దీన్(ఐజా)

-విభిన్న ప్రతిభావంతురాలికి సొంత డబ్బుతో పెన్షన్ ఇచ్చిన వైనం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతురాలి పెన్షన్ ను ప్రభుత్వం నిలిపివేయడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానిక 43వ డివిజన్ ఊర్మిళ నగర్ కు చెందిన ఇరువూరి ప్రశాంతి కుమారికి తన సొంత డబ్బుతో రెండు నెలల పెన్షన్ 6000 రూపాయలను జనసేన నగర అధికార ప్రతినిధి, మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ (ఐజా) అందజేశారు. గురువారం ఉదయం ఊర్మిళనగర్ లోని ప్రశాంతి కుమారి ఇంటికి జనసేన నాయకులతో కలిసి …

Read More »

రాష్ట్ర చరిత్రలో సువర్ణధ్యాయం జగనన్న పాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతికి తావులేని సంక్షేమ పాలన అందిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా పాలన సాగిస్తున్నారు అని,రాష్ట్ర చరిత్రలో సువర్ణధ్యాయం జగనన్న పాలన అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని 32వ సచివాలయ పరిధిలోని బ్రహ్మానందరెడ్డి నగర్ 5వ లైన్ నుండి మొదలై అప్పలనాయుడు …

Read More »