Breaking News

8న ప్రధాని మోడి విశాఖపట్నం పర్యటన-కట్టుదిట్టమైన ఏర్పాట్లు : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 8వ తేదీ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విశాఖపట్నం రానుండగా అందుకు సంబంధించి కట్టుదుట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు.ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం మరోసారి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నిటినీ మంగళవారం రాత్రికి పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఏచిన్న పొరపాటుకు ఆస్కారం లేని రీతిలో కట్టుదుట్టమైన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వర్చువల్ గా సుమారు 20 వరకూ వివిధ ప్రారంభోత్సవాలు,శంఖుస్థాపనలను చేయనున్నారని కావున సంబంధిత శాఖల అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన ఏర్పాట్లన్నిటినీ పటిష్టంగా నిర్వహించాలని సిఎస్ ఆదేశించారు.
8వ తేదీ బుధవారం సాయంత్రం 4.15 గం.లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విమానంలో విశాఖపట్నం చేరుకుని సా.4.45 గం.ల నుండి 5.30 గం.ల వరకూ రోడ్డు షోలో పాల్లొంటారని సిఎస్ విజయానంద్ వెల్లడించారు.అనంతరం సా.5.30 గం.ల నుండి 6.45 గం.ల వరకూ ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళశాల మైదానం సభా వేదిక వద్ద నుండి వర్చువల్ గా పలు శంఖుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేసి సభలో మాట్లాడతారని తెలిపారు. తదుపరి సాయంత్రం 6.50 గం.లకు సభా వేదిక నుండి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రాత్రి 7.15 గం.ల విశాఖ నుండి విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళతారని సిఎస్ పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విశాఖలో సుమారు 3 గం.ల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని ముఖ్యంగా వెంకటాద్రి వంటిళ్ళు రెస్టారెంట్ ప్రాంతం నుండి సుమారు కిలోమీటరు పొడవున రోడ్డు షోలో పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకూ చేరుకుంటారని సిఎస్ విజయానంద్ తెలిపారు.అక్కడ నుండే వర్చువల్ గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్,నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు,కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్,గుంటూరు-బిబినగర్,గుత్తి-పెండేకళ్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారని తెలిపారు.అదే విధంగా 16వ నంబరు జాతీయ రహదారిలో చిలకలూరి పేట 6లైన్ల బైపాస్ ను జాతికి అంకితం చేయడం తోపాటు పలు జాతీయ రహదార్లు,రైల్వే లైన్ల ను వర్చువల్ గా ప్రధాని ప్రారంభిండం జరుగుతుందని సిఎస్ విజయానంద్ వెల్లడించారు.
ప్రధాని పర్యటనలో భాగంగా రోడ్డు షోలో పాల్గొనేందుకు పెద్దఎత్తున వచ్చే ప్రజలు,ప్రజా ప్రతినిధులు రానున్నందున వారి వాహనాల పార్కింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలక్టర్,పోలీస్ కమీషనర్,మున్సిపల్ కమీషనర్ తదితర అధికారులను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.సాయంత్రం వేళలో ప్రధాని పర్యటన జరగనున్నందున రోడ్డు షో, సభా వేదిక,వివిధ పార్కింగ్ స్థలాల్లో తగిన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.సభా వేదిక,పార్కింగ్ ప్రాంతాల్లో తాగునీరు,తాత్కాలిక మరుగుదొడ్లు,ఇతర సౌకర్యాలను కల్పించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు.ప్రధాని పర్యటనకు విశాఖపట్నం సహా పరిసర అనకాపల్లి,విజయనగరం,శ్రీకాకుళం తదితర జిల్లాల నుండి ప్రజలను బస్సులు,ఇతర వాహనాల్లో తరలించనున్నందున వారిని సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలక్టర్లు,ఎస్పిలను సిఎస్ ఆదేశించారు.సమావేశానికి వచ్చే వారికి తాగునీరు, అల్పాహారం,భోజన వసతి వంటి ఏర్పాట్లలో ఎటువంటి విమర్శలకు తావీయకుండా తగిన ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలక్టర్ సహా పరిసర జిల్లాల కలక్టర్లను ఆదేశించారు. వాహనాల ట్రాఫిక్,పార్కింగ్ వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని డిజిపి,విశాఖ పోలీస్ కమీషనర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.
ఈవీడియో సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న డిజిపి ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి ఎస్పిజి సమన్వయంతో పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.విశాఖపట్నం జిల్లా కలక్టర్ హరీంద్ర ప్రసాద్ వర్చువల్ గా పాల్గొని మాట్లాడుతూ విశాఖనగరంలో ప్రధాని రోడ్డు షోలో సుమారు 80వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.అదే విధంగా సభలో లక్షా 80 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లనీ దాదాపు పూర్తి కావచ్చాయని ఏర్పాట్లన్నిటినీ మంగళారం రాత్రికి పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు.విశాఖ పోలీస్ కమీషనర్ ఎస్.బాగ్చి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వివిధ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్ చేయడం జరిగిందని తెలిపారు.
ఈసమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్)ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్,ఇంటిలిజెన్స్ ఐజి పిహెచ్డి రామకృష్ణ పాల్గొనగా వర్చువల్ పలు శాఖల కార్యదర్శులు,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *