విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటికైన ముఖ్యమంత్రి తనకు న్యాయం చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ కోరుతున్నారు. శుక్రవారం విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనకు గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఆత్మకూరులో సర్వే నంబర్ 117/1 ఎలో 85 సెంట్ల స్థలం అన్ని ఆధారాలతో ఉన్నా కూడా తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు. పట్టా భూములు నిషేధిత జాబితలో ఎటువంటి గెజిట్ లేకుండా చట్ట విరుధమైన పనులను మంగళగిరి సబ్ …
Read More »Latest News
ఎడిసికి వీడ్కోలు పలికిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తన మిలటరీ ఏడీసీ మేజర్ సాహిల్ మహాజన్‌కు వీడ్కోలు పలికారు. ఆగస్టు 2019లో ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఏడీసీగా బాధ్యతలు స్వీకరించిన సాహిల్ మహాజన్, పదవీకాలం పూర్తయిన నేపధ్యంలో శనివారం విధుల నుంచి రిలీవ్ కానున్నారు. కార్యక్రమంలో భాగంగా సాహిల్ మహాజన్‌ను గవర్నర్ శ్రీ హరిచందన్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ సాహిల్ గవర్నర్ …
Read More »కుల, మత, రాజకీయాల అతీతంగా సంక్షేమం దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా నేడు తూర్పు నియోజకవర్గంలోని 7వ డివిజన్ 39,40 సచివాలయ పరిదిలోని CSI స్కూల్,కమిలి బాబా ఆశ్రమము,గుమ్మడి తోట,శివగిరి కొండ మరియు పడమటి వారి స్ట్రీట్ లో కొండ పైన చివరి అంచు వరుకు ఉన్న ఇంటి ఇంటికి కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి తో కలిసి తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ప్రభుత్వ పధకాల లబ్ధిదారుల జాబితా పట్టుకొని, ప్రతి గడప …
Read More »నకిలీ ఎరువుల తయారీదారులపై వరుస దాడులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్రమంగా ఎరువులను తయారు చేస్తున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించే విధముగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టుచున్నది. సత్తుపల్లి ఎరువుల దుకాణాలలో పోటాష్ కు మారుగా ఇసుకకు రంగు కలిపి విక్రయిస్తున్న వారిని తెలంగాణ వ్యవసాయ అధికారులు, పోలీస్ వారు పట్టుకుని విచారించారు. దాని తయారీదారులు, విక్రయకారులు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్లు తెలుసుకుని, మన రాష్ట్ర వ్యవసాయ శాఖ సిబ్బంది పోలీస్ వారి సహకారంతో వరుస దాడులు నిర్వహిస్తున్నారు. గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో 11. …
Read More »ముందస్తుగా సాగునీటి విడుదలకు ప్రణాళికను ఖరారు చేసిన క్యాబినెట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏడాదిలో మూడు పంటలు పండించే విధంగా రైతులకు అవకాశం కల్పించేందుకై ఈ ఏడాది వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందుగానే రైతులకు సాగునీటి విడుదలచేసే ప్రణాళికకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ఉన్న నదులు, జలాశయాల నుండి ప్రణాళికా బద్దంగా సాగునీటిని విడుదల చేసేందుకు షెడ్యూలును ఖరారు చేసింది. ప్రతి ఏడాది అనుసరించే వ్యవసాయ సీజన్ కంటే ముందుగానే రైతులు సాగును ప్రారంభించి ఏడాది ఆఖరులో సంభవించే తుఫానుల కంటే ముందుగానే వ్యవసాయ ఉత్పత్తులను రైతులు …
Read More »ఎపి సిఎస్ డా.సమీర్ శర్మ పదవీ కాలం మరో 6 నెలలు పొడిగింపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది.సిఎస్ డా.శర్మ ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి సిఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి డిఓ లేఖ వ్రాయడం జరిగింది.సియం విజ్ణప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఎపి సిఎస్ డా.సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో ఆరు మాసాల పాటు అనగా …
Read More »ఖరీఫ్ సీజన్ కు ముందుగానే సాగునీరు విడుదల… : మంత్రి జోగి రమేష్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈసారి ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ముందుగానే ప్రారంభించడమే కాకుండా.. కృష్ణ, గోదావరి డెల్టాలకు, రాయలసీమ ప్రాజెక్టులకు ముందుగానే సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఉద్గాటించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ, ఈ ఏడాది ముందస్తుగా వ్యవసాయ సీజన్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగానే కృష్ణా, గోదావరి జలాలను విడుదల చేస్తామని తెలిపారు. గతంలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఆగస్టు …
Read More »పారదర్శకంగా ఉండండి, ప్రజలకు న్యాయం చేయండి
-శిక్షణ ఐఎఎస్ లతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సివిల్ సర్వీసు అధికారులు దేశం గురించి ఆలోచించాలని, భారతదేశ రాజ్యాంగ నిబంధనలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడవలసిన బాధ్యత వారిదేనని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవాలని, భారత రాజ్యాంగం పౌరులందరికీ చట్టం ముందు సమానత్వం, సమాన రక్షణను కల్పించిందన్నారు. విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాల్ వేదికగా శిక్షణలో ఉన్న ఐఎఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో గవర్నర్ …
Read More »వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా !
-ఏ.పి.యు.డబ్ల్యు.జే. నేతలకు గవర్నర్ హామీ ! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ , ఏ.పి.యు.డబ్ల్యు.జే. నాయకత్వబృందం గురువారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి వినతిపత్రం అందజేసింది. గవర్నర్ ను కలిసిన వారిలో ఐ.జే.యు. జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు , జాతీయ కార్యవర్గ సభ్యుడు …
Read More »లక్ష్యాలను అధిగమించేందుకు నిర్దుష్టమైన ప్రణాళికలు అమలు చేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు నిర్దుష్టమైన ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పేదలందరికీ ఇళ్లు, ఓటీఎస్, స్పందన, వైద్య ఆరోగ్య, సచివాలయ తదితర అంశాలపై సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిపై అధికారులు దృష్టి …
Read More »