తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ వైవి సుబ్బారెడ్డి బుధవారం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, సుబ్బారెడ్డి తో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి చైర్మన్ ని శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందించారు. పలువురు ప్రజాప్రతినిధులు చైర్మన్ ని …
Read More »Latest News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ కు వివరించిన ఎమ్మెల్యే విడదల రజిని గారు నాడు- నేడు పథకానికి బ్రిటన్ నుంచి ఏపీకి ఆర్థిక సాయం అందేలా చూస్తా : బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో పరిపాలన పారదర్శకంగా ఉందని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ఆండ్రూ ఫ్లెమింగ్ కితాబిచ్చారు. ఏపీలో పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ని కలిశారు. విజయవాడలో ఆండ్రూ ఫ్లెమింగ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల అభివృద్ధితోపాటు మహిళాభ్యున్నతికి పాటుపడే ప్రభుత్వాలను బ్రిటన్ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఆయా దేశాలకు అవసరమైన ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో …
Read More »విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దెందుకు విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం : విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దెందుకు విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర విద్య శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. స్థానిక ఎమ్మార్ ఏ ఆర్ పీజీ కేంద్రంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అకాడమిక్ బ్లాక్ నిర్మాణపనులకు బుధవారం మంత్రి శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం లోని ప్రభుత్వ …
Read More »కైకలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 8మందికి రూ. లక్షా 50 వేలు చెక్కులు అందించాం… : ఎమ్మెల్యే డిఎన్ ఆర్
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్యానికి గురియై ఆసుపత్రులలో వైద్య చికిత్స పొందిన నిరు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి అయ్యిన ఖర్చును అందింస్తూ వారిని ఆదుకోవడం జరుగుతుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం స్థానిక శాసనసభ్యులు అధికారిక క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహయ నిధి నుంచి వచ్చిన చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డిఎన్ఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకున్న 8 మంది బాధితులకు ఇటీవల చెక్కులు రావడం జరిగిందన్నారు,. ఇప్పుడు ముఖ్యమంత్రి …
Read More »నేడు మనం మొక్క ను నాటి సంరక్షిస్తే భవిష్యత్తులో మహా వృక్షమై మంచి ఫలాలతో పాటు ప్రాణవాయువును అందిస్తుంది… : ఎమ్మెల్యే డిఎన్ ఆర్
ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు ఒక మొక్క ను నాటి సంరక్షిస్తే అది భవిష్యత్ లో మహా వృక్షమై చెప్పలేని గొప్ప ఫలాల్ని అందిస్తుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ముదినేపల్లి మండలం సింగరాయపాలెం లోని శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహమణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరిగిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఎన్ ఆర్ మాట్లాడుతూ పచ్చని పల్లెసీమల్ని చల్లని వాతావరణాన్ని ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం …
Read More »క్రిస్టియన్ కౌన్సిల్ వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా… : మంత్రి కొడాలి నాని
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు జాన్ బెన్నీ లింగం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు ప్రాంతానికి చెందిన తాను క్రిస్టియన్ కౌన్సిల్ కు జాతీయ …
Read More »గుడివాడ డివిజన్లో 2.75 లక్షల డోన్ల వ్యాక్సినేషన్… : మంత్రి కొడాలి నాని
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ డివిజన్ లో ఇప్పటి వరకు 2 లక్షల 75 వేల 962 డోసుల వ్యాక్సినేషన్ చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కొవిషీల్డ్ మొదటి డోసు ఒక లక్షా 31 వేల 092 మందికి, రెండవ డోసు 72 వేల 245 మందికి, …
Read More »స్వాతంత్ర్య వేడుకల నిర్వహణకై చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు రాష్ట్ర ప్రభుత్వం వారిచే నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలకు వచ్చు అతిధులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయుటతో పాటుగా మెరుగైన పారిశుధ్య పరిస్థితులు నెలకొల్పులని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సంబందిత అధికారులను ఆదేశించారు. నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి ఇందిరాగాంధీ అవుట్ డోర్ స్టేడియంను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబందించి …
Read More »నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపండి : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 15 వ డివిజన్, రామలింగేశ్వర నగర్ నందు పుట్ట ప్రాంతంలోని దేవాదాయ భూములలో గత 40 సంవత్సరల నుండి నివాసం ఉంటున్న 50 కుటుంబల వారికి శాశ్వత నివాసం కల్పించాలని కలెక్టర్ నివాస్ గారిని కోరినట్లు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తో కలిసి కలెక్టర్ ని కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని …
Read More »బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తో మర్యాదపూర్వక భేటి : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన పారదర్శకంగా ఉందని బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కి వివరించినట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.ఏపీ లో పర్యటిస్తున్న వారు బుధవారం గుణదల లోని అవినాష్ స్వగృహానికి మర్యాదపూర్వకంగా విచ్చేయాగ బ్రిటీష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మరియు బ్రిటిష్ ప్రభుత్వ సలహాదారు శ్రీమతి నళిని రఘురామన్ గారిని …
Read More »