Breaking News

Latest News

పాలనను ఇంటింటికీ చేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే..

-పేదవారికి అన్నివిధాల చేయూత నందించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ ధ్యేయం.. -ఎంపీ కోటగిరి శ్రీధర్ -ఎమ్మెల్యే. డీఎన్నార్ కలిడింది, నేటి పత్రిక ప్రజావార్త : పాలనను ఇంటింటికీ చేర్చిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదేనని పేదవారికి అన్నివిధాల చేయూత నందించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు. ఆదివారం కలిదిండి మండలం కాళ్లపాలెం గ్రామంలో నూతనంగా రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. …

Read More »

పీవీ సింధుకు అభినందనలు తెలిపిన గవర్నర్ హరి చందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతోషం వ్యక్తం చేశారు. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా సాగిన పోరులో సింధు స్పష్టమైన ఆధిక్యం కనబరిచి, వరుస గేమ్స్‌లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆమె రెండో పతకం అందించగా గవర్నర్ తన అభినందనలు …

Read More »

పి.వి.సింధు పోరాట పటిమకు జేజేలు… : పవన్ కల్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం గెలుచుకొని మన దేశానికి మరో పతకాన్ని అందించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానని  జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ కార్యాలయం నుండి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసారు. టోక్యోలో మన దేశ పతాకం మరోమారు రెపరెపలాడేలా చేసిన సింధుని చూసి దేశమంతా గర్విస్తోంది. అప్పుడు రియోలోనూ, ఇప్పుడు టోక్యోలోనూ… వరుసగా రెండు ఒలింపిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారిణిగా …

Read More »

కనకదుర్గమ్మ సేవ కోసం జనసేన ధార్మిక సేవా మండలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి జనసేన ధార్మిక సేవా మండలి నియామకానికి ఆమోదం తెలిపిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధానానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవ చేయడంతోపాటు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా జరిగే నిత్య కైంకర్యాలు సక్రమ పద్ధతిలో జరుగుతున్నాయో లేదో అని పరిశీలించడం, ఆలయంలో భక్తిప్రవత్తులు వెల్లివిరిసే విధంగా పర్యవేక్షించడం ధార్మిక సేవా మండలి ప్రధాన లక్ష్యం. …

Read More »

2న నగర ప్రజల సమస్యల పరిష్కార వేదిక “స్పందన” : క‌మిష‌న‌ర్‌ ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా సోమవారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం మరియు సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమము జరుగుతుందని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ప్రకటన ద్వారా తెలియజేసారు. నగరపాలక సంస్థకు సంబంధించి ప్రజలకు మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌లో ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించుకొనుటకు ది.02.08.2021 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మద్యాహ్నం 1.00 గంట వరకు న‌గ‌ర పాల‌క సంస్థ‌ ప్ర‌ధాన కార్యాలయంలో మేయ‌ర్‌, క‌మిష‌న‌ర్ మరియు మూడు సర్కిల్ …

Read More »

కలెక్టర్ జె. నివాస్ నేతృత్వంలో ముమ్మరంగా సాగుతున్న వరద ముంపు నివారణ చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం సాయంత్రానికి నాగార్జున సాగర్ డాం నుంచి మిగులు జలాలను విడుదల చేయనున్నారు. ఆదివారం అర్ధరాత్రి కి ఫుల్ రిజర్వాయర్ స్థాయికి చేరుకుంటుంది. ప్రారంభదశలో 2 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు విడుదల ఉండవచ్చు. సోమవారం ఉదయం నుంచి 4.5 లక్షల క్యూసెక్కుల నుంచి 5 లక్షల వరకు పెరగనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపద్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశాలతో వరద ముంపు నివారణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. …

Read More »

వరద ఉధృతి దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి …

-సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ జి. ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ సూచించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం వరద ముంపు నివారణ చర్యల్లో భాగంగా నగరంలో ని భూపేష్ గుప్త నగర్, తారక రామనగర్, దోబీఘాట్, ఇంద్రకీలాద్రి రోడ్, పెనమలూరు , యన మలకుదురు ఇసుక …

Read More »

సోమవారం స్పందన కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివిజన్ లోని ప్రజల సమస్యల పరిష్కార సౌకర్యార్థం ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకూ స్పందన కార్యక్రమం నిర్వహించబడుతుందని విజయవాడ సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వారిచే స్వయంగా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించ బడును. కృష్ణా జిల్లా కలెక్టర్ వారి సర్కులర్ ఆదేశాల మేరకు స్పందన కార్యక్రమం పునరుద్ధరణలో భాగంగా ప్రతి సోమవారం …

Read More »

సాకారమవుతున్న స్వంత ఇంటి కల…

-ఇళ్ల లబ్దిదారుల ముఖాల్లో వికసిస్తున్న ఆనందం… -కొండంత సంబరంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్దిదారులు… – జిల్లాలో జగనన్న కాలనీలలో జోరందుకున్న స్వగృహ నిర్మాణాలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు స్వంత ఇల్లు సమకూర్చాలన్న ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి సంకల్పం కార్యరూపం దాలుస్తోంది. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు క్రింద వై.యస్.ఆర్. జగనన్న కాలనీల్లో పేదల స్వంత ఇంటికల నెరవేర్చేందుకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. జిల్లాలోని పక్కా గృహాలు లేనివారందరికీ జగనన్న కాలనీల్లో పట్టాలిచ్చి త్వరితగతిన గృహాలు నిర్మించి …

Read More »

రైతుల పాలిట వరం – రైతు భరోసా కేంద్రాలు…

-కొవ్వూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజిన్ పరిధిలో 92 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత జిల్లాలో ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన పశ్చిమగోదావరి జిల్లా లో 70 శాతం మంది వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ అనుబంధ రంగముల సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థాయి లో ఒక వ్యవసాయ అధికారిని నియమించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు భరోసా గా నిలిచేందుకు రైతు భరోసా …

Read More »