Breaking News

Telangana

రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పక పాటించాలి

-నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి -జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. ఢిల్లీరావు -ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పక పాటించి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.ఢిల్లీ రావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్, …

Read More »

బిజెపి పశ్చిమ నియోజకవర్గం సీటు గొల్లగాని రవికృష్ణ కి కేటాయించాలి…

-కె.వి.రామారావు నాయి బ్రాహ్మణుల రాష్ట్ర నాయకులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణుల సమైఖ్య మరియు బీసీ సమైక్య మరియు యాదవ సంఘం సమైఖ్య పశ్చిమ నియోజకవర్గ ప్రజా అభిప్రాయ సేకరణ మేరకు నాయి బ్రాహ్మణులు, బిసి అభ్యర్థి పశ్చిమ నియోజకవర్గం లో ఎవరైనాప్పటికీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దృఢ సంకల్పంతో ఉన్నట్లు కె. వి.రామారావు నాయి, నాయి బ్రాహ్మణ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి …

Read More »

చేనేతలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు చేనేతలకు తగిన సీట్లు కేటాయించి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని విస్మరిస్తే ఓడిరచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆల్‌ ఇండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. మంగళవారం గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆల్‌ ఇండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ అద్యక్షులు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బండారు ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ యంత్రమూ లేని పరిస్థితుల్లో, ఏ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమూ లేని రోజుల్లో మగ్గాన్ని …

Read More »

అన్ని రాజకీయ పార్టీలు సహకార వ్యవస్థ పరిరక్షణకు హామీ ఇవ్వండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రాజకీయ పార్టీలు 60 శాతం భారత ప్రజల ఆర్థిక రంగమైన సహకార వ్యవస్థను 10 శాతంగా వున్న పెట్టుబడిదారులకు ఆక్రమంగా అప్పగించడానికి కేంద్రం తెచ్చిన చట్టాలను సవరిస్తామని తమ ఎన్నికల ప్రణాళికలలో హామీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని సహకార ధర్మపీఠం విజ్ఞప్తి చేసింది. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సహకార ధర్మపీఠం ధర్మకర్త సంభారపు భూమయ్య మాట్లాడుతూ దేశంలోని 90 శాతం గ్రామాల్లోని 98 శాతం గ్రామీణ కుటుంబాలకు చెందిన 29 …

Read More »

కోస్తాంధ్రకు వర్షసూచన…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మండుటెండల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఐఎండి సూచనల ప్రకారం జార్ఖండ్‌ నుండి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఈనెల 20వ తేదీన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. బుధవారం అల్లూరిసీతారామరాజు, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అలాగే మిగిలినచోట్ల …

Read More »

ఏసీబీ వలలో అవినీతి అధికారి..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నతాధికారులు ఇచ్చిన వర్క్ ఆర్డర్ ను ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఏఈని అవినీతి శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో వెహికల్ డిపోలో ఏసీబీ అధికారులు దాడులు సోమవారం నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ బంగారు రాజు ఆధ్వర్యంలో దాడి చేసి, డిపో ఇన్ఛార్జ్ ఏఈ ఈశ్వర్ కుమార్ రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండె గా పట్టుకున్నారు. షేక్ సద్దాం హుస్సేన్ అనే కాంట్రాక్టర్ ఇచ్చిన …

Read More »

నేటి నుండే రాష్ట్రంలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం

-4 ఏప్రిల్, 2024 న ముగియనున్న మూల్యాంకన ప్రక్రియ -బోర్డు ఆదేశాలకు అనుగుణంగా 23,000 మంది అధ్యాపకులచే మూల్యాంకన ప్రక్రియ -పారదర్శకంగా పదో తరగతి బోర్డు పరీక్షలు -పరీక్షా నిర్వహణ, పర్యవేక్షణ కోసం 35,119 మంది ఇన్విజిలేటర్లు, 156 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 682 సిట్టింగ్ స్వ్కాడ్లు -ప్రశ్న పత్రంలోని ప్రతి పేజీ పై భాగంలో క్యూఆర్ కోడ్ తో పాటు వాటర్ మార్క్ తో కూడిన వెబ్ డింగ్ ఫాంట్ కోడ్ -పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఆధునిక మౌలిక వసతుల కల్పన -దేశంలోనే …

Read More »

SSC పబ్లిక్ పరీక్షలు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : SSC పబ్లిక్ పరీక్షలు మార్చి–2024, 18-03-2024 నుండి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్తో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 3473 కేంద్రాలలో 6,54,553 మంది నమోదవ్వగా 6,30,633 (96.35% ) మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, విజయవాడ లోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ ( గుణదల) మరియు FIIT JEE ఇంటర్నేషనల్ స్కూల్ ను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మరియు ప్రభుత్వ పరీక్షల …

Read More »

ప‌టిష్ట స‌మ‌న్వ‌యానికి కమాండ్ కంట్రోల్ కేంద్రం

– బృంద స్ఫూర్తితో ఎన్నిక‌ల విధులు నిర్వ‌ర్తించాలి – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నిక‌ల‌ను స్వేచ్ఛాయుతంగా, నిష్ప‌క్ష‌పాతంగా ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నిర్వ‌హించేందుకు క‌మాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని (ఐసీసీసీ) ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని.. అధికారులు బృంద స్ఫూర్తితో విధులు నిర్వ‌ర్తించాలని క‌లెక్ట‌ర్ డిల్లీరావు ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతిరాణా టాటాతో క‌లిసి క‌లెక్ట‌రేట్‌లోని కంట్రోల్ రూం కార్య‌క‌లాపాల‌ను ప‌రిశీలించారు. సీ-విజిల్‌, కాల్‌సెంట‌ర్‌, ఎన్నిక‌ల వ్య‌య …

Read More »

ప్రచార మాధ్యమాల్లోని పెయిడ్ ఆర్టికల్స్‌పై గట్టి నిఘా పెట్టండి…

-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రచార మాధ్యమాల్లో ప్రచురితం, ప్రసార‌మ‌య్యే పెయిడ్ ఆర్టికల్స్‌పై గట్టి నిఘా పెట్టాలని.. ఈ విషయంలో ప్రచార మాధ్యమాల ప్రతినిధులు అప్ర‌మ‌త్తంగా వ్యవహరించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. ఎన్నికల సమయంలో ప్రచార మాధ్యమాలు అనుసరించాల్సిన విధివిధానాల‌పై జిల్లా కలెక్టర్ డిల్లీరావు జాయింట్ క‌లెక్ట‌ర్ డా.పి.సంప‌త్ కుమార్‌తో క‌లిసి సోమవారం సంబంధిత అధికారుల‌తో క‌లెక్ట‌రేట్‌లో స‌మావేశం నిర్వ‌హించారు. భారత ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాల‌ను మీడియా యూనిట్లు పాటించాల‌న్నారు. …

Read More »