Breaking News

రూర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్, రూరల్ టెక్నాలజీ పార్క్ సంద‌ర్శ‌న

హైద‌రాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ హైద‌రాబాద్ రాజేంద్ర‌న‌గ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్శిటీలోని జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయ‌తీ రాజ్ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) సంస్థ ను , రూరల్ టెక్నాలజీ పార్క్ (RTP) ను శుక్ర‌వారం సంద‌ర్శించారు. రూర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ నిమిత్తం సెంట‌ర్ గ‌వ‌ర్నమెంట్ నుంచి వ‌చ్చే నిధులు, వున్న ప‌థ‌కాలు, గ్రామీణా ప్రాంత ప్ర‌జ‌ల జీవ‌నోపాధి మెరుగుప‌ర్చేందుకు, సిల్క్ డెవ‌ల‌ప్ మెంట్ ద్వారా ఉపాధి క‌ల్పించే అవకాశాలు తెలుసుకునేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్, రూరల్ టెక్నాలజీ పార్క్ అధికారుల‌ను క‌లుసుకోవ‌టం జ‌రిగింది.

ఎంపి కేశినేని శివ‌నాథ్ ను ఆ సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డా.జి న‌రేంద్ర‌కుమార్ ఐ.ఏ.ఎస్ తో పాటు ఇత‌ర అధికారులు సాద‌ర స్వాగతం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ కు డైరెక్ట‌ర్ జ‌న‌రల్ న‌రేంద్ర కుమార్ బృందం ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ లోని ప్రధాన ప‌థ‌కాలు, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM), పంచాయతీ భాద్యతలు , సిల్క్ డెవ‌ల‌ప్ మెంట్ ప్రణాళికలు స‌వివ‌రంగా వివరించారు.

ఆ తరువాత ఎంపీ రూరల్ టెక్నాలజీ పార్క్ (RTP) ను సందర్శించారు, అక్కడ ఆర్.టి.పి బృందం త‌క్కువ ఖ‌ర్చుతో వినూత్నంగా త‌యారు త‌యారు చేసిన గ్రామీణ సాంకేతిక పరిజ్ఞానాలను ప్రదర్శించారు. వాటిలో సుస్థిర గృహనిర్మాణ నమూనాలు, పుట్టగొడుగుల సాగు, తేనె ఉత్పత్తి, వర్మికంపోస్టింగ్, చేతితో తయారు చేసిన కాగితం, వేప ఆధారిత ఉత్పత్తులు వంటి పరిజ్ఞానాలు ఉన్నాయి. ఈ సాంకేతికతలు గ్రామీణ సమాజానికి ఆర్థికంగా సహాయం చేస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించబడ్డాయని ఆర్.టి.పి బృందం ఎంపి కేశినేని శివ‌నాథ్ కి తెలియ‌పర్చింది. ఈ గ్రామీణ సాంకేతిక ప‌రిజ్ఞాల‌ను అమలు చేసి రూర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ తో పాటు, గ్రామీణ ప్ర‌జ‌ల జీవ‌నోపాధి మెరుగుపర్చేందుకు కృషి చేస్తాన‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్, రూరల్ టెక్నాలజీ పార్క్ అధికారుల‌కు తెలిపారు. ఇక్క‌డకి రావ‌టం వ‌ల్ల తెలుసుకున్న విష‌యాలు అమలు చేసి రూర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ కోసం కృషి చేస్తామ‌న్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *