ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిజీ శుక్రవారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, శ్రీ దుర్గమ్మ వారి ఆలయమునకు విచ్చేయగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ డా. జి.వాణీ మోహన్, IAS, ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, పాలక మండలి సభ్యులు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ వారు …
Read More »Telangana
ఏఐటీటీ ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ హోల్డర్స్‌కు సీఎం జగన్ అభినందనలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏఐటీటీ 2020 (సీటీఎస్)లో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్ సాధించిన ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్ధులను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఒక్కోక్క విద్యార్ధికి రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకం, ఏపీఐఐసీలో వారి చదువుకు అనుగుణంగా ఉద్యోగం ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. డి.మణికంఠ, మెకానిక్ డీజిల్ ట్రేడ్‌లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్, మొండి సతీష్, ఎలక్ట్రీషియన్, ఆల్ ఇండియా ఐదో ర్యాంక్, ఎన్.కుమారి, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, …
Read More »ఓటర్లు నిర్బయంగా ఓటుహక్కును వినియోగించుకోవాలి…
-బద్వేల్ ఉప ఎన్నిక పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బద్వేల్ ఉప ఎన్నికలో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్దంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బద్వేల్ ఉప ఎన్నిక పటిష్టంగా నిర్వహించేందుకు చేసిన …
Read More »పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల ఏపీ ఎఫ్ డి సి చైర్మన్ టి.ఎస్.విజయ్ చందర్ దిగ్భ్రాంతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత ప్రేక్షకాదరణ గల కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ టి.ఎస్.విజయ్ చందర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే గుండె పోటుతో మరణించిన పునీత్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఆయన అన్నారు. కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్ తనయుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం సినీ పరిశ్రమను తీవ్రంగా కలచివేసిందని విజయ్ చందర్ అన్నారు. 46 ఏళ్ల వయసుకే విపరీతమైన క్రేజ్ …
Read More »వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు…
-నగరంలో అవార్డుల ప్రధానోత్సవ ట్రయల్ రన్ పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ప్రదానం చేయనున్న వైఎస్సార్ జీవిత సాఫల్య వైఎస్సార్ సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమ ట్రయల్ రన్‌ను శుక్రవారం నిర్వహించారు. నగరంలోని ఏ1 కన్వెన్షన్ హాలు నందు శుక్రవారం రాత్రి అవార్డుల ప్రధానోత్సవ ఏర్పాట్లను, ట్రయల్ రన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ముఖ్యమంత్రి కార్యదర్శి రేవు ముత్యాలరాజు, జిల్లా కలెక్టర్ జె. నివాస్, నగర పోలీస్ …
Read More »ఉపరాష్ట్రపతి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయండి … : అధికారులకు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశం
-స్వర్ణభారతి ట్రస్ట్, డా.పిన్నమనేని ఆసుపత్రులలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉపరాష్ట్రపతి నాలుగు రోజుల పర్యటన సందర్భంగాఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారతి ట్రస్ట్ మరియు చిన అవుటపల్లిలోని డా. పిన్నమనేని ఆసుపత్రులలో ఏర్పాట్లను శుక్రవారం అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటన లో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా …
Read More »సచివాలయం ద్వారా పౌరులకు అందించే సేవలు విసృత్తం చేయాలి…
విజయవాడ/ పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పెనమలూరు మండలం గంగూరు 1,2 గ్రామ సచివాలయాలను శుక్రవారం విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం ద్వారా పౌరులకు అందించే సేవలు విసృత్తం చేయాలన్నారు. వార్డు సచివాలయ ద్వారా ప్రజలకు అందించిన వివిధ సర్వీసుల వివరాలపై సచివాలయ సిబ్బందిని వాకబు చేశారు. వార్డు సచివాలయ ద్వారా అందించే సేవలు వేగవంతం కావాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే సచివాలయాల ఏర్పాటు ముఖ్య ఉద్ధేశం …
Read More »ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్ వైద్య అధికారులకు సిబ్బందికి సూచించారు. శుక్రవారం స్థానిక పాత ప్రభుత్వ ఆస్పత్రిని సబ్ కలెక్టర్ ప్రవీణ్‌చంద్ ఆకస్మీక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపి రిజిస్టేషన్, వెయిటింగ్ హాల్, వాష్‌ఏరియా, గైనిక్ వార్డ్, స్కానింగ్ కేంద్రం,ప్రసవానంతర వార్డులను సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులు, వారిసహాయకులు పట్ల మర్యాదపూర్వకంగా …
Read More »జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి… : కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటిఎస్) సర్వేను రెండురోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి మండల అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం సర్వే, డేటా ఎంట్రీ అంశాలపై కలెక్టర్ జె. నివాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటిఎస్ సర్వేను అక్టోబరు 31కి పూర్తి చేసి ఒక పద్దతి ప్రకారం డేటా ఎంట్రీని చేయాలన్నారు. …
Read More »టిబి సీల్ సేల్ క్యాంపెయిన్ ప్రారంభించిన గవర్నర్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ డెభై రెండవ టిబి సీల్ సేల్ క్యాంపెయిన్‌ను శుక్రవారం ప్రారంభించారు. రాజ్ భవన్ దర్బార్ హాల్ లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో టిబి అసోసియేషన్ గౌరవ ప్రధాన కార్యదర్శి డి.బాలచంద్ర, కార్యక్రమం గురించి వివరించారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్ధలం కేటాయింపుకు సహకారం అందిస్తున్న గవర్నర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గవర్నర్ ఎఎంజి ఇండియా ఇంటర్నేషనల్ అధ్యక్షులు డాక్టర్ అరుణ్ కుమార్ …
Read More »