ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆయన ఓ జిల్లా కలక్టర్ సమస్య అని వచ్చి న ఓ వృద్దురాలిని అమ్మలా అక్కున చేర్చుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా IAS కలెక్టర్ కార్యాలయం నుండి బయటకు వెళుతున్న సమయంలో కలెక్టరేట్కు తన సమస్య పరిష్కారం కోసం వచ్చిన మొగల్తూరు మండలం కొత్తట గ్రామానికి చెందిన పిప్పళ్ళ చంద్రమ్మ ను చుసి ఆమెను అక్కున చేర్చుకుని అమె సమస్య సాదరంగా విన్నారు. ఆమె భుజం మీద చెయ్యి వేసుకుని లోనకు తీసుకువెళ్లి జాయింట్ కలెక్టర్ …
Read More »Telangana
సాకారం అవుతున్న సొంత ఇంటి కల…
-వై.యస్.ఆర్. జగనన్న కాలనీల్లో ఊపందుకున్న ఇళ్ల నిర్మాణాలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లులో భాగంగా పేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు కృష్ణాజిల్లా యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇళ్ల స్థలాలు అందించడమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా వై.యస్.ఆర్. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. కొన్నిచోట్ల భవన నిర్మాణ మేస్త్రీలను గుర్తించి వారికి గ్రూపులను అనుసంధానించి నిర్మాణ పనులు అప్పగిస్తున్నారు. ఇప్పటికే 25 వేలమంది లబ్దిదారులతో …
Read More »తెల్లవారుజామునుంచే తలుపు తట్టిన వాలంటీర్లు…
-పెళ్లి పీటలు ఎక్కల్సిన వరుడు పింఛను కానుక అందిస్తూ… -బుధవారం సాయంత్రం 5 గంటల వరకు సామాజిక పెన్షన్లు 88.45 శాతం పంపిణీ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక పెన్షన్ల పంపిణీ కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో, నగరాల్లో, పట్టణాల్లో, ఉత్సహాంగా ప్రారంభమైంది. పెన్షన్‌దారుల వద్దకు వాలంటీర్లు వెళ్లి పెన్షన్ డబ్బులు అందించడంపై లబ్దిదారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. పెళ్లిపీటలు ఎక్కల్సిన గంపలగూడెంకు చెందిన వాలంటీర్ కోట శివ తన పెళ్లిరోజే తలకు బాసికంతో …
Read More »మంత్రి కొడాలి నాని కృషితో దక్షిణ భారతదేశంలోనే తొలి అదమా ఆక్సిజన్ ప్లాంట్…
-గుడివాడ ఏరియా ప్రభుత్వానుపత్రిలో ఏర్పాటు… -నేడు ప్రారంభించనున్న మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కృషి ఫలితంగా దక్షిణ భారతదేశంలోనే తొలి అదమా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను కృష్ణాజిల్లా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాంట్ ను ఈ నెల 2 వ తేదీ ఉదయం 9 గంటలకు మంత్రి కొడాలి నాని చేతులమీదుగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, …
Read More »శ్రీ కొండాలమ్మ దేవస్థానంలో మంత్రి కొడాలి నాని ప్రత్యేక పూజలు…
-శేష వస్త్రాలతో సత్కరించిన ఆలయ చైర్మన్ రామిరెడ్డి… -జేసీ డాక్టర్ మాధవీలతకు అమ్మవారి చిత్రపటం బహుకరణ… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ దేవస్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మంత్రి కొడాలి నానికి అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. …
Read More »రూ. 8 లక్షల వ్యయంతో కొండాలమ్మ దేవస్థానంలో అభివృద్ధి పనులకు భూమిపూజ…
-శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి కొడాలి నాని… -జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలతకు ఘన సత్కారం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలోని వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ దేవస్థానంలో అభివృద్ధి పనులకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అభివృద్ధి పనులకు బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రూ. 8 లక్షల వ్యయంతో చేపట్టే పర్మినెంట్ ఐరన్ పందిరి నిర్మాణానికి …
Read More »గ్రామాల్లో ప్రజలకు ఇంటింటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని అందించడమే జలజీవన్ విషన్ పథకం యొక్క ముఖ్యేద్దేశ్యం..
-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలుచేసే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సమిష్టి బాధ్యతతో పనిచేసుకుంటూ ముందుకెళ్లిననాడు మంచి ఫలితాలు వస్తాయని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కలిదిండి లోని వెలుగు కార్యాలయంలో మండలంలో జల జీవన్ మిషన్ పనులపై సంబంధిత శాఖల సిబ్బందికి జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు ఇంటింటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని ఉచితంగా అందించేందుకు …
Read More »సహకార వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది… : మంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : సహకార వ్యవస్థను బలోపేతం చేసే దిశగా యాజమాన్య పద్ధతుల్లో తీసుకురావాల్సిన మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం దొమ్మేరు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనము నకు మంత్రి తానేటి వనిత శంఖుస్థాపనచేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, తమది రైతు సంక్షేమ ప్రభుత్వ మన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను …
Read More »అడుగుకో గుంత… గజానికో గొయ్యి… : పవన్ కల్యాణ్
-వైసీపీ పాలనలో ఏపీ రహదారుల దుస్థితి… -రోడ్డు బాగు చేయమంటే వేధింపులు… లాఠీ ఛార్జీలు… అరెస్టులు… -పాడైన రోడ్లను #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో చూపిద్దాం… -ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి రోజున శ్రమదానంతో రోడ్లను బాగు చేద్దాం… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే అక్కడ రహదారుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను …
Read More »నూతక్కి నుండి కుంచనపల్లి వరకు రోడ్డు విస్తరణ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆర్కే…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతక్కి నుండి కుంచనపల్లి బైపాస్ రోడ్డు వరకు 10.5 కిలోమీటర్ల రోడ్డును CRIF నిధుల క్రింద 14 కోట్ల రూపాయలతో విస్తరణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే బుధవారం పాల్గొని నిర్మాణ సంస్థ సూపర్ వైజర్ చేత శిలాఫలకం ప్రాంభింపచేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ నూతక్కి నుండి వయా గుండిమెడ, ప్రాతురు గ్రామాల మీదుగా కుంచనపల్లి బైపాస్ రోడ్డు వరకు 10.5 కిలోమీటర్ల రోడ్డును 14 కోట్ల రూపాయలతో నిర్మించటానికి ఈ రోజు శంకుస్థాపన చేయటం …
Read More »