Breaking News

Daily Archives: July 17, 2024

ఫిర్యాదుదారులపైనే చర్యలు చేపట్టడం అన్యాయం… : బి.చిట్టిరాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రైల్వే డివిజన్‌లో అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంమాని ఫిర్యాదుదారులపైనే చర్యలు చేపట్టడం అన్యాయమని చైతన్య భారతి సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షులు బి.చిట్టిరాజు ఆరోపించారు. చైతన్య భారతి సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు బి.చిట్టిరాజు బుధవారం గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌ నందు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో కొందరు రైల్వే అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఇటువంటి అధికారులపై రైల్వే సీబీఐ, విజిలెన్సు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. …

Read More »

నరసాపురం ఎంపీడీఓ అదృశ్యంపై విచారణ చేపట్టండి

-నరసాపురం ఫెర్రీ బకాయిల వివరాలు అందించండి -అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నరసాపురం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎమ్. వెంకటరమణారావు అదృశ్యం, అందుకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్  ఆదేశించారు. అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.  వెంకట రమణారావు రాసిన లేఖ, అందులోని వివరాల గురించి …

Read More »

అన్నమయ్య జిల్లా అభివృద్ధికి చక్కటి బాటలు వేయాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమయ్య జిల్లా రహదారి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి జిల్లా అభివృద్ధికి చక్కటి బాటలు వేయాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు మదనపల్లికి వచ్చిన కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి సమర్పించారు శ్రీరాంప్రసాద్ రెడ్డి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి మదనపల్లిలో ఘన స్వాగతం పలికారు. వినతి …

Read More »

రైతు ఆదాయం పెంపుకు కృషి

-ప్రకృతివ్యవసాయాన్నిప్రోత్సహిస్తాం -సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దిగుబడి పెంపకు చర్యలు -కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రైతు కు చేరువ చేస్తాం -భూసారం పెంపుకు ప్రాధాన్యత -నాపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెం నాయుడు అధికారులకు ధన్యవాదాలు -కమీషనర్ ఎస్.ఢిల్లీరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శతాబ్దాల కాలం నుంచి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని నూతనంగా వ్యవసాయ శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. డిల్లీరావు అన్నారు. మంగళగిరిలోని వ్యవసాయ …

Read More »

జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదును సంబరంలా చేద్దాం

-అన్ని నియోజకవర్గాల్లో గురువారం పండగ వాతావరణంలో కార్యక్రమాన్ని ప్రారంభించాలి -పది రోజులపాటు ఆహ్లాదకర వాతావరణంలో కార్యక్రమం జరగాలి -ఎన్నికల అనంతరం పార్టీ తీసుకున్న కార్యక్రమాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్లండి -యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు సభ్యత్వ నమోదు కోసం వేచి చూస్తున్నారు. -పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ క్రియాశీలక …

Read More »

విశాఖపట్నం రేంజ్ డీఐజీ గా గోపీనాథ్ జెట్టి ఐపిఎస్ 

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో జరిగిన ఐపీఎస్ ల బదిలీల్లో భాగంగా విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జట్టి ఐపీఎస్., రేంజ్ పోలీస్ కార్యాలయంలో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. వీరు 2008 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. గోపినాథ్ జట్టి ఐపీఎస్ 2010 జనవరి నుండి 2010 సెప్టెంబర్ వరకు విశాఖపట్నం రురల్ జిల్లాలో శిక్షణ అనంతరం 2010 అక్టోబరు నుండి 2011 మార్చి వరకు గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ గాను, 2011 ఏప్రిల్ నుండి 2013 ఏప్రిల్ వరకు …

Read More »

ఇంజనీరంగ్ తొలి విడతలో 1,17,136 సీట్లు భర్తీ

-సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ నవ్య -జులై 19 నుండి ప్రారంభం కానున్న తరగతులు -మలివిడత కోసం మిగిలి ఉన్న సీట్లు 19,524 -తదుపరి దశలో క్రీడా, ఎన్ సిసి కోటా సీట్ల భర్తీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా బుధవారం తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. విధ్యార్ధులు జులై 22వ తేదీ లోపు …

Read More »

నగరంలో నూతనంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఖాతాదారుల ఆధారాభిమానాలు పొందడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన బ్యాంకు అధికారులకు సూచించారు. నగరంలోని విద్యాధరపురం, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంకు బ్రాంచిని బుధవారం జిల్లా కలెక్టర్ డా. జి సృజన జాయింట్ కలెక్టర్ పి. సంపత్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …

Read More »

మెరుగైన పారిశుధ్య పనులు ప్రణాలికాబద్దంగా జరిగేందుకు సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్యాన్ని ప్రజలకు అందించేందుకు వీక్లీ స్పెషల్ శానిటేషన్ యాక్షన్ ప్లాన్ మేరకు సూపర్వైజరి అధికారులు పర్యవేక్షణ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారి పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని డిఆర్సీ హాల్లో నగర కమిషనర్ కీర్తి చేకూరితో కలిసి గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు ప్రణాలికాబద్దంగా జరిగేందుకు జిఎంసి ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, సూపర్వైజరి …

Read More »

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీ కి ఘన స్వాగతం

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : నేటి బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర రోడ్డు రవాణా మరియు హై వేస్ కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీ కి ఆం.ప్ర రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులు శాఖ మంత్రి బి.సి జనార్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్&బి కాంతి లాల్ దండే, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, చంద్రగిరి ఎంఎల్ఎ పులివార్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ …

Read More »