Breaking News

అన్నమయ్య జిల్లా అభివృద్ధికి చక్కటి బాటలు వేయాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నమయ్య జిల్లా రహదారి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి జిల్లా అభివృద్ధికి చక్కటి బాటలు వేయాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు మదనపల్లికి వచ్చిన కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి సమర్పించారు శ్రీరాంప్రసాద్ రెడ్డి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి మదనపల్లిలో ఘన స్వాగతం పలికారు. వినతి పత్రంలో ప్రధానంగా ఈ అంశాలను ప్రస్తావించారు.

1) రాజంపేట – రాయచోటి – కదిరి రహదారి – రాష్ట్ర రహదారి నుండి జాతీయ రహదారి వరకు 135 కి.మీ. అప్ గ్రేడేషన్
ఆంధ్రప్రదేశ్ లో రాజంపేట – రాయచోటి – కదిరి రహదారి చాల ముఖ్యమైన స్టేట్ హైవే. ఈ రహదారి మూడు జాతీయ రహదారులతో అనుసంధానం అవుతుంది. అవి:a) రాజంపేట వద్ద ఎన్ హెచ్-716 (రేణిగుంట – కడప రోడ్డు)

b) రాయచోటి వద్ద ఎన్ హెచ్ -40(కర్నూలు – చిత్తూరు – రాణిపేట రోడ్ )
c) కదిరి వద్ద ఎన్ హెచ్ -42 (ఉరవకొండ – అనంతపురం – కదిరి – మదనపల్లి – కృష్ణగిరి రోడ్డు )

2) ఎన్ హెచ్ -40 కి సంబంధించి కడప – రాయచోటి రోడ్ నుండి 2 లేన్లు చదును చేయబడిన వైపు నుండి 4 లైన్ల వరకు విస్తరించడం.
3) సిఆర్ఎఫ్ పథకం కింద 72.180 కిలోమీటర్ల 6 రోడ్ల విస్తరణ – అంచనా వ్యయం రూ.109.70 కోట్లు.
అన్నమయ్య జిల్లాలో మౌలిక రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *