విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లో జరిగిన ఐపీఎస్ ల బదిలీల్లో భాగంగా విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జట్టి ఐపీఎస్., రేంజ్ పోలీస్ కార్యాలయంలో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. వీరు 2008 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. గోపినాథ్ జట్టి ఐపీఎస్ 2010 జనవరి నుండి 2010 సెప్టెంబర్ వరకు విశాఖపట్నం రురల్ జిల్లాలో శిక్షణ అనంతరం 2010 అక్టోబరు నుండి 2011 మార్చి వరకు గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ గాను, 2011 ఏప్రిల్ నుండి 2013 ఏప్రిల్ వరకు ఏఎస్పీ చింతపల్లి గాను, 2013 నుంచి 2014 సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గుంటూరు గాను, 2014 నుంచి 2016 వరకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, తిరుపతి గాను, 2016 నుండి 2017 వరకు 6th బెటాలియన్ కమాండెంట్ గాను , 2017 నుండి 2018 సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కర్నూలు గాను, 2019 నుండి 2022 వరకు TTD చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గాను, ఏప్రిల్, 2022 నుండి గ్రే హౌండ్స్ డీఐజీ గాను పనిచెయ్యడం జరిగింది. చింతపల్లి సబ్ డివిజన్ ఏఎస్పీ గా విశాఖపట్నం రూరల్ జిల్లాలో పనిచేసిన అనుభవం వలన, విశాఖపట్నం రేంజ్ పై పూర్తి అవగాహన ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో రేంజ్ డీఐజీ మాట్లాడుతూ తన పరిధిలోని ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తమ శాఖ లోని అన్నివిభాగాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేర నియంత్రణకు మరియు శాంతి భద్రతల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోని, ప్రాథమిక పోలీసింగ్ (basic policing) అమలు జరిగే విధంగా కృషి చేస్తానని అలాగే ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా చేయటమే తన ప్రథమ కర్తవ్యం అని తెలిపారు. అదే విధంగా నక్సల్స్ ప్రాబల్యం కలిగి ఉన్నాప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ముఖ్యముగా గంజాయిని నిర్మూలించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించి తగు చర్యలు చేపడతామని, తాను అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, వార్తలు ప్రచురించే ముందు తనను లేదా జిల్లా ఎస్పీలను సంప్రదించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని ఆయన మీడియాను కోరారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీఐజీ ని రేంజ్ పరిధిలోని, పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News