Breaking News

ఫిర్యాదుదారులపైనే చర్యలు చేపట్టడం అన్యాయం… : బి.చిట్టిరాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రైల్వే డివిజన్‌లో అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంమాని ఫిర్యాదుదారులపైనే చర్యలు చేపట్టడం అన్యాయమని చైతన్య భారతి సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షులు బి.చిట్టిరాజు ఆరోపించారు. చైతన్య భారతి సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు బి.చిట్టిరాజు బుధవారం గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌ నందు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో కొందరు రైల్వే అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఇటువంటి అధికారులపై రైల్వే సీబీఐ, విజిలెన్సు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఐతే ఫిర్యాదుదారులు అవినీతి అధికారుల పై ఫిర్యాదు చేసే క్రమంలో వారి పేరు, ఉద్యోగ వివరాలు సైతం రాయడంతో కొందరు విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపి అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టకుండా, ఫిర్యాదుదారుల వివరాలను ఎవరిపై ఫిర్యాదు చేశారో వారికి సమాచారం అందించడంతో ఆ అధికారులు ఫిర్యాదు చేసిన వారిపై కక్ష పూరిత ధోరణితో సర్వీస్‌ నుండి తొలగిస్తున్నారని అలా ఇబ్బదులకు గురైన వారిలో చాలామంది తనను సంప్రదించి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. నూజివీడు సెక్షన్లో టిఎఫ్‌ టి.ఆర్‌, టిఆర్టి పనులలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందన్నారు. అవినీతికి పాల్పడుతున్న సంబంధిత అధికారులపై ఫిర్యాదు చేసిన రైల్వే ఉద్యోగి విక్టర్‌బాబు పైనే చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలోనే రైల్వే ఉద్యోగి విక్టర్‌బాబు తను సెక్షన్‌ లో జరుగుతున్న అవినీతి పై సంబంధిత అధికారి గురించి విజిలెన్స్‌శాఖకు ఫిర్యాదు చేయగా ఆ విషయం తెలుసుకున్న ఆ అధికారి వివక్షతో విక్టర్‌బాబును సస్పెండ్‌ చేసారన్నారు. తనకు జరిగిన అన్యాయం పై కోర్టును ఆశ్రయించగా మరల న్యాయం జరిగిందని గుర్తు చేశారు. ఎవరైనా రైల్వే ఉద్యోగులు రైల్వేలో జరుగుతున్న అవినీతిగురించి పై అధికారుల పై ఫిర్యాదు చేసే క్రమంలో ఉద్యోగి పేరు హోదా వెల్లడిరచకుండా ఫిర్యాదు చేయమని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విక్టర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణనాధుడిని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *