Breaking News

కమిషనర్‌పై అనుచిత వాఖ్యలు చేయటం తగదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవాదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ పై వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న అనుచిత వాఖ్యలు చేయటం తగదని, తక్షణం ఉపసంహరించుకుంటూ క్షమాపణలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కోగంటి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా శాఖకు చెందిన ఒక అధికారిణిపై వస్తున్న వచ్చిన అరోపణలు కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారింది. ఆ ఆరోపణలకు సంబంధించి విజయసాయిరెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్‌ను, మీడియా సంస్థల ప్రతినిధులను ఇష్టమొచ్చినట్లు తూలనాడుతున్నారు. రాజ్యసభ సభ్యులై ఉండి ఇలాంటి భాష మాట్లాడడం సరికాదు తక్షణం పత్రికా ముఖంగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే ఉద్యోగ సంఘాలు అన్ని జేఏసీగా ఏర్పడి తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో దేవాలయం ఉద్యోగులు కె.ఎస్‌.వి.రాజగోపాల్‌, డి.సుందర్‌రావు, ఎల్‌.రాఘవేంద్రరావు, హైకోర్టు న్యాయవాది, ఎండోమెంట్‌ లీగల్‌ అడ్వైజర్‌ బి.ఎస్‌.ఎన్‌.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *