-పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం, నేటి పత్రిక ప్రజావార్త :
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జులై 18 నుంచి 5 వరకు జరిగే డి.ఎస్.సి పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్ చట్టం -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని పోలీసు కమిషనర్ సునీల్ దత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఖమ్మంలోని 6 పరీక్ష కేంద్రాలలో జులై 18 నుండి ప్రతి రోజు రెండు సెషన్లలో, ఉదయం 09:00 నుండి మద్యాహ్నం 12:00 వరకు. మద్యాహ్నం గం.2:00 నుండి,సాయంత్ర గం 05:00 వరకు కమిషనరేట్ పరిధిలో నిర్వహించే పరీక్షా కేంద్రాలలో, ఉదయం గం.6:00 నుండి సాయంత్రం గం.6:00 వరకు సెక్షన్ 163 అంక్షలు అమలలో ఉంటాయని, పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని, ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజెలతో ఊరేగింపులు, దర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా పరీక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు అనుమతించబడుతుందన్నారు.కేంద్రాల పరిసర ప్రాంతాలలో పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలుంటాయన్నారు.
Prajavartha Online Telugu News