Breaking News

Monthly Archives: July 2024

ట్రాక్టర్, ద్విచక్ర వాహనాలపై వరద బారిన పడిన లంకగ్రామాలలో పర్యటించిన కలెక్టర్ నాగరాణి

నరసాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతికి ముంపుకు గురైన లంక గ్రామాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఆచంట మండలం అయోధ్య లంక, మర్రిమూల గ్రామానికి పడవపై చేరుకున్న పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. నీట మునిగిన లంక గ్రామాలకు ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ మీద ప్రయాణిస్తూ లంక గ్రామ వాసులకు భరోసానందించారు. ఎస్సీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో కలయ తిరుగుతూ ప్రతి కుటుంబం యొక్క యోగక్షేమాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి …

Read More »

కోవిడ్ పిదప ఊపిరితిత్తులవ్యాథిపై అవగాహన

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనా పిదప మానవాళికి ఊపిరితిత్తుల వ్యాథులపై అవగాహన పెంచుకోవాలన్న ఆతృత ఏర్పడిందని ఉపిరితిత్తులు శ్వాసకోశవ్యాథుల నిపుణులు K.మిథునేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం కవిరాజపార్కులో జరిగిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోషియోషన్ సమావేశంలో ఆయన మఖ్య అతిథిగిహాజరై ముక్కుద్వారా ద్వారా గాలి అంటె ఆక్సిజన్ తీసుకొని ఊపిరితిత్తులద్వారా ఫిల్టర్ కాబడి కార్బన్ డై ఆక్సైడ్ వదలివేసి శ్వాస క్రియకు ఉపయోగపడతాయని అన్నారు. న్యుమోనియా TB ఆస్తమా ,సాధారణంగా బ్యాక్టీరియా స్వభావం కలిగిన ఇన్ఫెక్షన్ …

Read More »

ఈ నెల 29వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)ప్రారంభం..

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 29వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) …

Read More »

రూ.220 కోట్ల వ్యయంతో ఇంటింటికి తాగునీరు

-రూ.160 కోట్లతో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం -ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించిన మంత్రి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక బృందావన థియేటర్ పక్కన గల నియోజకవర్గ టీడీపి కార్యాలయంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. …

Read More »

మంగినపూడి బీచ్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగినపూడి బీచ్ ను రాష్ట్రానికే తలమానికంగా ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు యోగా సాధన కార్యక్రమం తొలిసారిగా మంగినపూడి సముద్ర తీరాన ఏర్పాటు చేశారు. గత ఐదు రోజులుగా చేస్తున్న యోగా సాధనకు భిన్నంగా ఆదివారం సముద్ర తీరాన ప్రకృతి ఒడిలో చల్లని ఆహ్వాదకర వాతావరణంలో సముద్రపు అలల సవ్వడి మధ్యన, …

Read More »

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దును స్వాగతించిన డాక్టర్ పి.వి . రమేష్ రిటైర్డ్ ఐఎయస్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : లోప భూయిష్టమైన రైతుల పాలిట యమపాసంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నూతన రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయటం పట్ల రిటైర్డ్ ఐఎయస్ అధికారి, పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరి డా!! పి.వి. రమేష్ హర్షాన్ని వ్యక్తం చేశారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ ఆదివారం ఉదయం విశాఖపట్నంలోని హోటల్ దస్ పల్లా లో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి – తక్షణ కర్తవ్యాలపై జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి జన చైతన్య వేదిక రాష్ట్ర …

Read More »

జూలై 29 సోమవారం “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ

-ప్రజల నుంచి అర్జిల స్వీకరణ -జిల్లా, డివిజన్, మండల కేంద్రంలో అధికారులు హాజరు కావాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 29 వ తేదీ సోమవారం నుంచి “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  “మీకోసం” ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను “పబ్లిక్ గ్రివియన్స్ రెడ్రెస్సల్ సిస్టం (పి జి ఆర్ ఎస్)” మీకోసం జిల్లా స్థాయిలో కలెక్టరేట్ …

Read More »

చంద్రబాబు, జగన్‌ల ప్రకటనలతో ప్రజల్లో గందరగోళం

-అసమర్థ ప్రధాని మోదీపై పొగడ్తలా? -రాష్ట్రంలో భూముల అన్యాక్రాంతంపై విచారణ జరిపించండి -ఆర్థిక పరిస్థితి, జరుగుతున్న పరిణామాలపై అఖిలపక్షం ఏర్పాటు చేయండి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశాన్ని అన్ని రంగాల్లో దివాళా తీయించిన అసమర్ధుడైన ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్ల మోదీ కష్టాన్ని శ్రమను నేడు దేశం వినియోగించుకుంటుందంటూ పొగడటాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. స్థానిక దాసరి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ …

Read More »

ఘనంగా విచారణ కుటుంబ మహోత్సవము

-సహాయ మాత విచారణ గురువు ఫాదర్: అనిల్ చే సమిష్టి దివ్యబలి పూజ -65 వసంతాలు పూర్తి చేసుకున్న వారికి తమ కొడుకు ,కూతురు మనవడు, మనవరాలు తో సన్మాన -ముగ్గులు పోటీలలో చురుకుగా పాల్గొన్న మహిళలు ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సహాయం మాత విచారణ ఇబ్రహీంపట్నం నందు ఆదివారం విచారణ కుటుంబం మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా సంఘస్తులందరూ కుటుంబాల వారిగా చేతిలో పూలతో క్యాండిల్ తో కలిసి దేవాలయంలోనికి ప్రవేశిస్తూ విచారణ గురు …

Read More »

రామయ్య సాహసమే ఉద్యోగులకు స్పూర్తి – మంత్రి గొట్టిపాటి రవి కుమార్

-లైన్ మెన్ రామయ్యను అభినందించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ -వరద ఉద్ధృతిని లెక్క చేయకుండా తీగలపై నడిచి విద్యుత్ పునరుద్ధరించిన రామయ్య -రామయ్య సాహసం ఇతర ఉద్యోగులకు ఆదర్శనీయమని మంత్రి కితాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకున్నామని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఇందుకు లైన్ మెన్ రామయ్య చేసిన సాహసమే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన కొనియాడారు. ప్రజావసరాలను …

Read More »