-ప్రజల నుంచి అర్జిల స్వీకరణ
-జిల్లా, డివిజన్, మండల కేంద్రంలో అధికారులు హాజరు కావాలి
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జూలై 29 వ తేదీ సోమవారం నుంచి “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక “మీకోసం” ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను “పబ్లిక్ గ్రివియన్స్ రెడ్రెస్సల్ సిస్టం (పి జి ఆర్ ఎస్)” మీకోసం జిల్లా స్థాయిలో కలెక్టరేట్ నందు, అదేవిధంగా డివిజన్, మునిసిపల్, మండల స్థాయి లో ఆయా ప్రధాన కార్యాలయాల్లో సంబంధిత శాఖల అధికారులు ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలియ చేశారు.
Prajavartha Online Telugu News