రూ.220 కోట్ల వ్యయంతో ఇంటింటికి తాగునీరు

-రూ.160 కోట్లతో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం
-ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించిన మంత్రి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక బృందావన థియేటర్ పక్కన గల నియోజకవర్గ టీడీపి కార్యాలయంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపిగ్గా ఆలకించిన ఆయన వారి సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారని, వారందరి సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ రోజు దాదాపుగా 250 అర్జీలను స్వీకరించామని, వాటిల్లో తక్షణమే పరిష్కారం కాగల సమస్యలకు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిష్కరించామన్నారు.

పరిస్థితులను బట్టి వారంలో శనివారం లేదా ఆదివారము రోజులలో ఒకరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి అర్జీలను స్వీకరిస్తున్నామని, పరిష్కరించిన సమస్యలను సంబంధిత అర్జీదారులకు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలియజేస్తున్నామన్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని చోట్ల నారుమళ్ళు మునిగిపోయి రైతులకు తీవ్ర నష్టం కలిగించాయని, అలాంటివారికి మరల నారుమళ్ళు పోసుకునేందుకు ఉచితంగా విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు సూచించడం జరిగిందన్నారు. అదేవిధంగా కాలువల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన తూటుకాడ, గుర్రపుడెక్క తొలగింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం జలజీవన్ మిషన్ ద్వారా రూ.220 కోట్ల వ్యయంతో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకు అవసరమైతే మరిన్ని నిధులను తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు మంజూరైన దాదాపు రూ.160 కోట్ల నిధులతో గ్రామాల్లోని రహదారులు, డ్రైనేజీలు, స్మశానవాటికలకు కాంపౌండ్ వాల్స్ పూర్తిస్థాయిలో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మచిలీపట్నం నగరంలోని మురుగు కాలవల్లో పూడుకుపోయిన సిల్ట్ తొలగించడంతో పాటు డ్రైనేజీలను మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.60 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో నగరంలో మురుగునీరు అనేది నిలవకుండా ఉండేలా డ్రైనేజీ వ్యవస్థపై మాస్టర్ ప్లాన్ ను రూపొందించేందుకు ఇటీవల నగరంలో ఢిల్లీ ప్రతినిధుల బృందం పర్యటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, స్థానిక నాయకులు బండి రామకృష్ణ, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యం, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *