Breaking News

ఘనంగా విచారణ కుటుంబ మహోత్సవము

-సహాయ మాత విచారణ గురువు ఫాదర్: అనిల్ చే సమిష్టి దివ్యబలి పూజ
-65 వసంతాలు పూర్తి చేసుకున్న వారికి తమ కొడుకు ,కూతురు మనవడు, మనవరాలు తో సన్మాన
-ముగ్గులు పోటీలలో చురుకుగా పాల్గొన్న మహిళలు

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సహాయం మాత విచారణ ఇబ్రహీంపట్నం నందు ఆదివారం విచారణ కుటుంబం మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా సంఘస్తులందరూ కుటుంబాల వారిగా చేతిలో పూలతో క్యాండిల్ తో కలిసి దేవాలయంలోనికి ప్రవేశిస్తూ విచారణ గురు ఫాదర్ అనిల్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సెంటెన్స్ సిస్టర్ జయ కుటుంబ మహోత్సవం క్షుణ్ణంగా వివరించారు. విచారణ గురు ఫాదర్ అనిల్ దీప ప్రజ్వలన చేసి సమిష్టి దివ్య బులి పూజను కొనసాగించారు. విజయవాడ కతోలిక శ్రీ సభ యావత్తు ప్రపంచమంతటా విచారణ కుటుంబ మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటుందని, ప్రతి ఒక్క కుటుంబం దేవుని సేవలో, దేవుని ప్రేమలో అభివృద్ధి చెందాలంటే ప్రార్థన అవసరమని, ప్రార్థన ద్వారానే ఎంతోమంది దేవునికి దగ్గరయ్యారని, కుటుంబ ప్రార్థనకు ఉన్నటువంటి విలువను తెలిపారు. విచారణలో ఉన్నటువంటి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి తమ బిడ్డ లు, మరియు మనువల్లు, మనవరాలు చే సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ తల్లిదండ్రులు పిల్లల కోసం చేసిన త్యాగ ఫలాలను గుర్తు చేస్తూ ప్రస్తుత సమాజంలో విలువలకు గర్వం లేకుండా పోతున్న తరుణంలో తల్లిదండ్రులను గౌరవించే పద్ధతిని గుర్తు చేశారు. అనంతరం విచారణ లో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో అత్యధికంగా మహిళలు పాల్గొని తమ ప్రతిభను కనపరుచుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులందరికీ వివిధ పోటీలు నిర్వహించారు. గత వారంలో నిర్వహించిన బైబిల్ క్విజ్ పరీక్షలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి కారుకులైనటువంటి సెంటెన్స్ బెంగళూరు సిస్టర్ సుపీరియర్ లూర్తి మేరీ సిస్టర్ తో పాటు సెంటెన్స్ బెంగళూరు సభకు చెందిన సిస్టర్స్ కు మర్యాదల సభ్యులు ఘనంగా సాలువ తొ సత్కరించారు. అనంతరం విచారణలో ఏర్పాటు చేసిన ప్రేమ విందులో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *