Breaking News

Monthly Archives: July 2024

కృత్రిమ కాళ్ళను తయారుచేసి రెండు నెలల వ్యవధి లోపల పంపిణీ…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల కొరకు శనివారం పుట్టుకతో దివ్యాంగులుగా మారటం, వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవడం మరియు ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించడం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిమ కాలు అమర్చుటకు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ వారు ఫ్రీడమ్ ట్రస్ట్ మరియు హుండాయ్ ట్రాన్సిస్ లీయర్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో రాస్ ప్రధాన కార్యాలయం నందు 166 మంది విభిన్న ప్రతిభవంతులను …

Read More »

నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలి

-పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి -2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎంఈజిపి లక్ష్యాల మేరకు మంజూరు, గ్రౌండింగ్ కు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలనీ, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని …

Read More »

తిరుపతి, రాయలసీమ జిల్లాలకు మెరుగైన ఉత్తమ పాస్‌పోర్ట్ సేవలు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాం

-ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి శివ హర్ష తిరుపతి, జూలై 27 : తిరుపతి మరియు రాయలసీమ జిల్లాలకు మెరుగైన పాస్‌పోర్ట్ సేవలు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము అని ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి శివ హర్ష శనివారం తిరుపతి లోని, ఎయిర్ బైపాస్ రోడ్డు వద్ద ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రం లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ అన్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి మాట్లాడుతూ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, విజయవాడ, రాయలసీమ జిల్లాలను కవర్ చేస్తూ తిరుపతి …

Read More »

జూలై మాసపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ

-ఆగస్ట్ 1వ తేదీన పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్ద అందుబాటులో ఉండాలి -జిల్లాలో 2,67,772 మంది లబ్దిదారులకు సుమారు రూ.113.17 కోట్లు పంపిణీకి చర్యలు: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : జూలై మాసపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే ఆగస్ట్ 1న ఉదయం 6 గం. నుండి పంపిణీ చేయనున్నట్లు మరియు సాంకేతిక కారణాలవలన మిగిలిపోయిన వారికి 2వ తేదీలో పంపిణీ చేయనున్నట్లు తెలుపుతూ లబ్ధిదారులు1వ …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సంఘం నుంచి అధ్యక్షుడిగా కె.ఆర్‌.ని బహిష్కరించాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ)లో చీలిక ఏర్పడిరది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి కె.ఆర్‌.సూర్యనారాయణను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని సుబ్బరాయన్‌ 2010లో ఏర్పాటు చేశారని, తరువాత సూర్యనారాయణ సంఘాన్ని తన చేతుల్లోకి తీసుకుని వ్యవస్థాపకులనే బయటకు తోసివేశారని అరోపించారు. కేె.ఆర్‌.సూర్యనారాయణ తమ అసోసియేషన్‌లో నిబంధనలు ఉల్లంఘించి …

Read More »

రూ.కోటి విలువైన నూతన వైద్య పరికరాలను ప్రారంభించిన మంత్రి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సాయంత్రం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని కంటి విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన రూ.కోటి విలువైన అదునాతన వైద్య పరికరాలను రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ క్రమంలో వైద్య పరికరాల పనితీరు, ఉపయోగాలను సంబంధిత వైద్యాధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రజల సౌకర్యార్థం మచిలీపట్నం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కంటి సమస్యలకు సంబంధించి వ్యాధుల నిర్ధారణ, చికిత్సల నిమిత్తం కోటి రూపాయల విలువైన …

Read More »

వరద ముంపు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా నిత్యవసర సరుకుల పంపిణీ, ఆర్ధిక సహాయం అందచేత

-జిల్లా వ్యాప్తంగా 1421 కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ -529 కుటుంబాలకు రూ.15 లక్షల 87 వేలు ఆర్ధిక సహాయం -ఒకొక్క కుటుంబానికి రూ.3 వేలు చొప్పున అందచేత -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరీ వరదలు, ఎర్ర కాలువ వరదలలో జిల్లాలో ముంపుకు గురి అయిన 1421 కుటుంబాలకు పునరావాస పరిహారం కింద నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా నిత్యావసర సరుకులను …

Read More »

రాజమండ్రీ రూరల్ లో ముంపు ప్రాంతంలో కలెక్టర్ పర్యటన

-ఆక్రమణలు తొలగింపు, కల్వర్టు నిర్మాణం పై ఆదేశాలు జారీ -ముంపు ప్రాంతాలలో శానిటేషన్ పనులు తక్షణం చేపట్టాలి -కలెక్టర్ ప్రశాంతి ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆవా ఛానల్ నుంచి గోదావరీ నది లోకి పంపుతున్న నీరు రాజమండ్రీ రూరల్ పరిథిలో పలు ప్రాంతాలు ముంపుకు గురి కావడం తో తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి రూరల్ పరిథిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్ధానికులు నగరం లోని …

Read More »

జాతీయ లోక్ అదాలత్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు ది. 14.09.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తూర్పు గోదావరీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ గంధం సునీత శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. రాజమహేంద్రవరం,అమలాపురం , కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, తుని , ముమ్మిడివరం, కొత్తపేట, ప్రత్తిపాడు …

Read More »

వినియోగదారులకి ఉచిత ఇసుక పంపిణీ చెయ్యడం లో రవాణా ధరల విషయములో హేతుబద్ధత కలిగి ఉండాలి

-ఇసుక రవాణా వాహనాల అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలు అమలు చేసే బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ, రవాణా, మైన్స్, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇసుక రవాణా కోసం వినియోగించే వాహనాల యజమానులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చార్జీలను వసూలు చేయాలని, ఈ విషయంలో …

Read More »