Breaking News

ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సంఘం నుంచి అధ్యక్షుడిగా కె.ఆర్‌.ని బహిష్కరించాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ)లో చీలిక ఏర్పడిరది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి కె.ఆర్‌.సూర్యనారాయణను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని సుబ్బరాయన్‌ 2010లో ఏర్పాటు చేశారని, తరువాత సూర్యనారాయణ సంఘాన్ని తన చేతుల్లోకి తీసుకుని వ్యవస్థాపకులనే బయటకు తోసివేశారని అరోపించారు. కేె.ఆర్‌.సూర్యనారాయణ తమ అసోసియేషన్‌లో నిబంధనలు ఉల్లంఘించి 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు 26 జిల్లాలని 13 జిల్లాలుగా కుదించామని తెలియజేశారు. గత ప్రభుత్వంతో మంతనాలు జరిపి తమ అసోసియేషన్‌ను సంప్రదించకుండా పిఆర్సి తక్కువకి మాట్లాడారని తెలిపారు. అలాగే ఉద్యోగస్తుల మీద తన అనుచరులతో అక్రమ కేసులు బనాయించారని, మహిళా ఉద్యోగస్తులను వేధింపులుకు గురిచేశారని ఆరోపించారు. అందువల్ల కె.ఆర్‌.సూర్యనారాయణని తమ సంఘం నుంచి బహిష్కరించామని తెలియజేశారు. కాకినాడలో తాను సంఘాన్ని నడుపుతున్న సందర్భంలో సూర్యనారాయణ తమతో కలిసి పనిచేయాలని కోరగా, ఆనాటి నుంచి సంఘం అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేసినట్లు తెలిపారు. అయితే సంఘం చాటున సూర్యనారాయణ ఉన్నతాధికారులను దుర్భాషలాడటం, అందరిపై అహంకారంతో ప్రవర్తించటం వల్ల సంఘం అనేక కేసులను ఎదుర్కొంటోందని వివరించారు. దళిత ఉద్యోగి అయిన నన్ను తీవ్రంగా అవమానించి, అప్రజాస్వామికంగా బయటకు పంపారని అన్నారు. సంఘం కొత్త అధ్యక్షుడిగా డి.శ్రీకాంత్‌ను నియమిస్తున్నామని పేర్కొన్నారు. గుల్ల నాగసాయిని కూడా సంఘము నుంచి బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఏపీజీఈఏకు మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పీఆర్సీలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు అన్యాయం చేసిన ద్రోహి సూర్యనారాయణ అని తాత్కాలిక నూతన అధ్యక్షుడు శ్రీకాంత్‌ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *