తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల కొరకు శనివారం పుట్టుకతో దివ్యాంగులుగా మారటం, వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవడం మరియు ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించడం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిమ కాలు అమర్చుటకు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ వారు ఫ్రీడమ్ ట్రస్ట్ మరియు హుండాయ్ ట్రాన్సిస్ లీయర్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో రాస్ ప్రధాన కార్యాలయం నందు 166 మంది విభిన్న ప్రతిభవంతులను ఎంపిక చేయడమైనది. వాటి విలువ సుమారు రూ. 33 లక్షల విలువగల కృత్రిమ కాళ్ళను తయారుచేసి రెండు నెలల వ్యవధి లోపల వారికి పంపిణీ చేయబడునని ఏవై శ్రీనివాస్ సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ తిరుపతి వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారు ఫ్రీడం ట్రస్ట్ బోర్డు మెంబర్ మరియు సాంకేతిక సిబ్బంది హ్యుండయ్ ట్రాన్సిస్లియర్ ఆటోమేటిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ వెంకటరత్నం జనరల్ సెక్రటరీ రాస్ మరియు జీకే రాజశేఖర్ నాయుడు రిహాబిలిటేషన్ ఆఫీసర్ మరియు విభిన్న ప్రతిభవంతుల సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొని జయప్రదం చేశారు.
Prajavartha Online Telugu News