Breaking News

నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలి

-పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి
-2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎంఈజిపి లక్ష్యాల మేరకు మంజూరు, గ్రౌండింగ్ కు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలనీ, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

శనివారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి) సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఉపాధి కార్యక్రమం (పి.ఎం.ఈ.జి.పి.) సమీక్షిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను లబ్దిదారుల నుండి అందిన దరఖాస్తులను పరిశీలిస్తే 190 యూనిట్లు మంజూరు చేయగా 96 గ్రౌండింగ్ అయ్యాయని మిగిలిన వాటి మంజూరు కొరకు త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హత మేరకు సత్వరమే యూనిట్లు మంజూరు, పెండింగ్ దరఖాస్తుల గ్రౌన్డింగ్ చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించబడిన లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని సూచించారు. MSME Udyam రిజిస్ట్రేషన్స్ ఎల్డిఎం, పీడీ, డిఆర్డిఎ మరియు పీడీ, మెప్మాలతో సమన్వయము చేసుకొని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.

సింగిల్ డెస్క్ విధానంలో ఏప్రిల్ 2024 నుండి 1127 పరిశ్రమలకు గాను 1080 అనుమతులు ఇచ్చామని మరో 43 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల పరిశీలన కమిటీకి అందిన మేరకు 61 పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రూ. 3.46కోట్లు అందించడానికి నేడు ఆమోదం తెలిపారు. పెట్టుబడి సబ్సిడీ 23, విద్యుత్ సబ్సిడీ 14, వడ్డీ రాయితీ 19, సేల్స్ టాక్స్ మినహాయింపు 3, స్టాంప్ డ్యూటీ 1 యూనిట్లకు ఆమోదించారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ప్రింటింగ్ క్లస్టర్, తిరుపతి, కలంకారీ క్లస్టర్, శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలం మధవమాల కింద వుడ్ కార్వింగ్ క్లస్టర్, కాపర్ వేజెల్స్ క్లస్టర్ ఎర్రమరెడ్డి పాలెం, రేణిగుంట మండలం, వెంకటగిరి శారీ ప్రింటింగ్ మరియు డైయింగ్ క్లస్టర్, నారాయణవనం పవర్ లూమ్ క్లస్టర్, ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్, తిరుపతి ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించి వేగవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు వివరిస్తూ ప్రింటింగ్ క్లస్టర్ తిరుపతికి గాను రాష్ట్ర స్థాయి ఆమోదం పొంది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కొరకు పంపారని తెలిపారు.

జిల్లాలో పరిశ్రమలు భద్రత ప్రమాణాలు అమలు చేయాలని, ప్రమాదాల నివారణకు తరచూ సంబందిత అధికారులు సేఫ్టీ మెజర్మెంట్ పై అవగాహన కల్పించి తప్పని సరిగా నిబంధనల మేరకు అమలు జరిగేలా చూడాలని ఆదేశించగా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వివరిస్తూ పలు పరిశ్రమలకు నోటీస్ లు ఇచ్చామని, భద్రత ప్రమాణాలు మెరుగు కొరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరిశ్రమలకు సంబందించిన అనుమతులు వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఏపిఐఐసి తిరుపతి ద్వారా భూమి కేటాయించబడిన పరిశ్రమలు మరియు నాయుడుపేట స్పెషల్ జోన్ ద్వారా భూమి కేటాయించబడిన పరిశ్రమలు వివిధ దశలలో వున్నాయి అని, త్వరితగతిన ఉత్పత్తులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, జోనల్ మేనేజర్ ఏపిఐఐసి తిరుపతి చంద్రశేఖర్, జోనల్ మేనేజర్ ఏపిఐఐసి తిరుపతి స్పెషల్ జోన్ విజయ రత్నం, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ రామకృష్ణ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య, ఎల్డిఎం విశ్వనాథ రెడ్డి, డిపిఓ సుశీల దేవి, తదితర అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *