-రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల ప్రస్తావన -బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై కృతజ్ఞతలు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి కేటాయింపులు చేయడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు రాష్ట్రానికి చెందిన మంత్రి శ్రీనివాస వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ లతో కల్సి సోమవారం ఆమె ప్రధానితో భేటీ …
Read More »Monthly Archives: August 2024
అమరావతిలో జిల్లాల కలెక్టర్ల సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఐదేళ్లలో తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలు, అమలు చేసే బాధ్యత అధికారులపై ఉందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సెప్టెంబర్ 20 నాటికి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుందన్నారు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని, దానికి కమిటై ఉన్నామన్నారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానమన్నారు. పరదాలు కట్టడం, చెట్లు నరకడాలు ఉండ కూడదన్నారు ముఖ్యమంత్రి. అమరావతిలో నేడు జరిగిన జిల్లాల కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను అందర్నీ కంట్రోల్ చేస్తున్నానని అంటూ …
Read More »సచివాలయాల్లో ఇసుక బుకింగ్ సదుపాయం
-వినియోగదారుడు అక్కడే డబ్బులు చెల్లించాలి -రీచ్ నుంచి ఇంటికి ఇసుక తీసుకెళ్లడానికి రవాణా ఛార్జీలు కూడా సచివాలయాల్లోనే చెల్లింపు -ఇసుక సామాన్యుడి హక్కు -ఇసుక అక్రమాలపై సీబీసీఐడీ దర్యాప్తు చేయిస్తాం -కలెక్టర్ల సదస్సులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక కావాల్సిన వినియోగదారులు తమ ప్రాంతంలోని సచివాలయంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో గనుల శాఖ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై మాట్లాడుతూ …
Read More »ఏ మున్సిపాల్టీలోనూ చెత్త కనపడటానికి వీల్లేదు
-అన్నా క్యాంటీన్లు స్వయం సమృద్ధి సాధించేలా చూడండి -టీటీడీ నిత్యాన్నదానం తరహాలో ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేద్దాం -కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలో కూడా చెత్త కనపడటానికి వీల్లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంటువ్యాధుల పట్ల శ్రద్ద కనబరచాలన్నారు. క్రమం తప్పకుండా నీటి పరీక్షలు నిర్వహించడంతో పాటు …
Read More »ధ్వంశమైన వ్యవస్థలను బలోపేతం చేసేందుకే అధికారంలోకి వచ్చాము
-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి & పిఆర్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిపాలనా పరంగా రాష్ట్రంలో సమూల మార్పు కోసమే రాష్ట్ర ప్రజలు పూర్తి మెజారీతో తమ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారని, వారి ఆశలు, అభిరుచులకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లు అందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అద్యక్షతన …
Read More »పేదవాడికి న్యాయం జరిగేలా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్ట సవరణ
-రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు & స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ హయాంలో జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ అంశం పునరావృతం కాకుండా ఉండేందుకై పేదవాడికి న్యాయం జరిగేలా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని సవరించనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు అద్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1982 ఏపీ …
Read More »ఇసుక ఉచితంగా ఇస్తున్నాం
-గత నాలుగేళ్లలో అక్రమ తవ్వకాలు యథేచ్చగా జరిగాయి -కలెక్టర్ల సదస్సులో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన గనుల శాఖ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఇసుక తవ్వకాలు అనేది …
Read More »ఈ-పంటలో పంట డిజిటల్ రికార్డింగ్
-10 లక్షల మందికి కౌలు రైతు గుర్తింపు కార్డులిస్తున్నాం -రాబోయే 5 ఏళ్లలో 20లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం -కలెక్టర్ల సదస్సులో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-పంట నమోదు కార్యక్రమంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ల సదస్సులో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ సూచించారు. ఈ-పంట నమోదులో ఈ సారి నేరుగా రైతులు సాగు చేస్తున్న పొలం వద్దకే వచ్చి వారు సాగు చేస్తున్న పంటను డిజిటల్ రికార్డింగు …
Read More »మత్స్యకారుల పడవలకు శాటిలైట్ కమ్యూనికేషన్
-రాబోయే 3 నెలల్లో 4,500 పడవలకు ఏర్పాటు -కలెక్టర్ల సదస్సులో మత్సశాఖ కార్యదర్శి బాబు ఏ. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారులకు ఉపయోగపడేలా చేపలవేటకు ఉపయోగించే పడవలకు శాటిలైట్ కమ్యూనికేషన్, ట్రాకింగ్ డివైజ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మత్స్యశాఖ కార్యదర్శి బాబు, ఏ తెలిపారు. మత్సశాఖ నిర్దేశించుకున్న లక్ష్యాల గురించి ఆయన సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వివరించారు. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఉపయోగపడేలా ఇస్రో సహకారంతో వారి పడవలకు శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల మత్స్యకారులకు …
Read More »అడవుల విస్తీర్ణం పెంచండి
-రూ.13.5 కోట్లతో జిల్లాలో సీడింగ్ కార్యక్రమం -అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరామ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి: అడవుల విస్తీర్ణం పెంపు దిశగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరామ్ కోరారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ అడవుల విస్తీర్ణం పెంచాల్సిన ఆవశ్యతకత గురించి వివరించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గతంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగేదని, గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఇది జరగలేదని తెలిపారు. …
Read More »