Breaking News

Daily Archives: September 8, 2024

వినాయకనగర్‌ ఉత్సవ కమిటీ వారి 5వ గణపతి నవరాత్రి మహోత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గణేష్‌ నవరాత్రుల మహోత్సవంలో భాగంగా వాడవాడల కొలువుతీరిన గణనాథునికి భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. వినాయకనగర్‌ ఉత్సవ కమిటీ వారి 5వ గణపతి నవరాత్రి మహోత్సవాలు నగరంలో హోమ్‌ రెన్నోవేషన్‌, టర్నీకీ ప్రాజెక్ట్‌, సివిల్‌ వర్క్స్‌, పెయింటింగ్‌ వర్క్స్‌, ఎ టూ జడ్‌ సర్వీస్‌ తదితర వివిధ రకాలైన సర్వీసులు అందజేయడంలో పేరొందిన ‘సర్వీస్‌ ఫస్ట్‌’ వారి ఆధ్వర్యంలో విజయవాడ, దావు బుచ్చయ్యకాలనీ, వినాయక నగర్‌లో వైభవంగా ప్రారంభించారు. నవరాత్రుల కమిటీ ‘సర్వీస్‌ ఫస్ట్‌’ కార్యక్రమ నిర్వాహకులు …

Read More »

రెండ్రోజుల్లో అంతా శుభ్రం చేస్తాం

-రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత -54, 56 డివిజన్లలో మాజీ ఎంపీ కొనకళ్లతో కలిసి వరద బాధితులకు మంత్రి పరామర్శ -ఎస్వీఆర్ స్కూల్లో ఫైరింజన్ తో శుభ్రం చేసిన మంత్రి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెండ్రోజుల్లో ఇళ్లు, వీధులు, షాపులు…అన్నీ శుభ్రం చేస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. ఆదివారం విజయవాడ నగరంలో 54, 56 డివిజన్లలో మాజీ ఎంపీ కొనకళ్ల సత్యనారాయణతో కలిసి పర్యటించారు. …

Read More »

గృహ నిర్మాణ 100 రోజుల లక్ష్యాల పూర్తిపై దృష్టిపెట్టండి..

– మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలి. – వరద ప్రభావిత ప్రాంతాల్లో గృహ నిర్మాణ అధికారులు సిబ్బంది సేవలు భేష్. – రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నిర్దేశించిన వందరోజుల ప్రణాళిక లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి ఆదేశించారు. గృహ నిర్మాణ …

Read More »

28 నిల్వ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఇసుక 14,22,664 మెట్రిక్ టన్నులు

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పలు చోట్ల రహదారులు దెబ్బతిన్న పరిస్ధితిలో ఇసుక రవాణా పరంగా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వినియోగదారులు తమవంతు సహకారం అందించాలని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఇసుక నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయని, వర్షాకాలం ముగిసిన తురువాత ఇసుక నిల్వలకు కొరత ఉండబోదన్నారు. …

Read More »

ప్ర‌తి బాధితునికీ న్యాయం జ‌ర‌గాలి

– నిబ‌ద్ధ‌త‌తో వాస్త‌వ గ‌ణాంకాల‌ను న‌మోదుచేసి స‌హాయ‌మందిద్దాం. – ముంపు న‌ష్ట‌గ‌ణ‌న ఎన్యూమ‌రేష‌న్ బృందాల‌కు -ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ) ఆర్‌పీ సిసోడియా దిశానిర్దేశం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద ముంపుతో న‌ష్ట‌పోయిన ప్ర‌తిఒక్క‌రికీ న్యాయం జ‌ర‌గాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని.. ప్ర‌భుత్వం కూడా ఇదే ఆలోచ‌న‌తో ముందుకెళ్తోంద‌ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, భూపరిపాలన, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్) ఆర్‌పీ సిసోడియా అన్నారు. వ‌ర‌ద ముంపు న‌ష్టాల‌ను న‌మోదు చేసేందుకు ఏర్పాటుచేసిన బృంద స‌భ్యుల‌కు …

Read More »

ఆన్ బోర్డింగ్ సెషన్స్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో వరద సహాయక చర్యల్లో పాల్గొనడానికి ఎలక్ట్రిషన్స్ మరియు ప్లంబింగ్ వర్కర్స్ కు, APSSDC/NAC మరియు UC అర్బన్ కంపెనీ ఆధ్వర్యంలో విజయవాడ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు జరిగిన ఆన్ బోర్డింగ్ సెషన్స్ కి మొదటి రోజు విశేష స్పందన లభించిందని, ఈ ప్రక్రియ రేపు కూడా కొనసాగుతుందని కృష్ణా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, ఇటీవల వరద బాధితుల ఇళ్లలో ప్లంబర్, ఎలక్ట్రిషియన్ సేవలు అందించేందుకు ఏపీ …

Read More »

2,32,000 గృహాల్లో న‌ష్టం అంచ‌నా వేసేందుకు 1,700 ఎన్యూమ‌రేష‌న్ బృందాలు

– వాణిజ్య‌వ్యాపార సంస్థ‌ల‌కు జ‌రిగిన న‌ష్టాన్ని కూడా అంచ‌నా వేస్తాం – న‌ష్టం వివ‌రాల‌ను ప్ర‌త్యేక యాప్‌లో న‌మోదు చేస్తాం – ఎలాంటి లోటుపాట్లు లేకుండా వాస్త‌వ అంచ‌నా వేసేలా చ‌ర్య‌లు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద ముంపు కార‌ణంగా గృహాలు, వ్యాపార సంస్థ‌లకు జ‌రిగిన ఆస్తి న‌ష్టాల‌ను అంచ‌నా వేసేందుకు 1700 బృందాలను ఏర్పాటుచేసి ప్ర‌త్యేక యాప్ ద్వారా వివ‌రాల‌ను న‌మోదుచేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు జిల్లా …

Read More »

వినూత్న విధానం తో ముంపు ప్రాంతాలలో వ్యవసాయ శాఖ సేవలు

-డ్రోన్ల ద్వారా ముంపు ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో ఆహార పదార్థాలు, మందుల పంపిణీ… -తొలిసారిగా ముంపు ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించిన మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు -తొలిరోజు నుండి 176 డ్రోన్ల వినియోగం -115 డ్రోన్లతో లక్ష ఇరవై మూడు వేల మంది వరద బాధితులకు ఆహార పంపిణీ, ఔషధ సేవలు… -50 డ్రోన్లతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ -11 డ్రోన్లతో వ్యాధులు వ్యాపించకుండా నీటిలో క్రిమి, కీటకాల నిర్మూలన కోసం పిచికారి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆకస్మికంగా సంభవించిన ఒక విలయం …

Read More »

MSCI EM IM సూచీలో చైనాను ఓడించిన భారత్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 2024లో, మోర్గాన్ స్టాన్లీ MSCI ఎమర్జింగ్ మార్కెట్స్ ఇన్వెస్టబుల్ మార్కెట్ ఇండెక్స్ (MSCI EM IMI)లో భారత్ తన వెయిటేజీ పరంగా చైనాను అధిగమించిందని ప్రకటించింది. MSCI EM IMIలో చైనాలో 21.58 శాతంతో పోలిస్తే భారతదేశం యొక్క వెయిటేజీ 22.27 శాతంగా ఉంది. MSCI IMI 3,355 స్టాక్‌లను కలిగి ఉంది మరియు పెద్ద, మధ్య మరియు చిన్న క్యాప్ కంపెనీలను కలిగి ఉంది. ఇది 24 ఎమర్జింగ్ మార్కెట్స్ దేశాలలో స్టాక్‌లను సంగ్రహిస్తుంది …

Read More »

అసత్య ప్రచారాలు చేయటం సరికాదు

-మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రాంతాలలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టామని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఆదివారం ప్రకటన విడుదల చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. విజయవాడ నగర వ్యాప్తంగా ముంపు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించానని తెలియజేశారు. సామాజిక మాధ్యమాలలో మేయర్ మిస్సింగ్ అని పోస్టులు పెడుతున్నారని, అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వరద ముంపుకు ప్రజలు …

Read More »